E-Paper
Advertisement

ఇంట్లో దర్జాగా గంజాయి సాగు చేస్తున్న బీటెక్ విద్యార్థి!

ఇంట్లో దర్జాగా గంజాయి సాగు చేస్తున్న బీటెక్ విద్యార్థి!
Advertisement

Cannabis Seizure: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతూ, ఎండు గంజాయిని సేకరించి విక్రయిస్తున్న యువకుడిని ఎస్‌ఓటీ మల్కాజిగిరి జోన్‌ బృందం, జవహర్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సజీవ గంజాయి మొక్కలు, నాలుగు గ్రాముల ఎండు గంజాయి, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం..

చిలకల సాయి దినేష్‌ (22) బీటెక్‌ విద్యార్థి. బాలాజీనగర్‌లోని సంతోషి నగర్‌, ప్లాట్‌ నంబర్‌ 117లో నివాసం ఉంటున్నాడు. తన ఇంటి ప్రాంగణంలో గంజాయి మొక్కలను పెంచడంతో పాటు, ఎండు గంజాయిని సేకరించి డబ్బుల కోసం వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.ఈ క్రమంలో నవంబర్‌ 20న ఎస్‌ఓటీ మల్కాజిగిరి జోన్‌ బృందం, జవహర్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో తనిఖీలు చేయగా రెండు సజీవ గంజాయి మొక్కలు, నాలుగు గ్రాముల ఎండు గంజాయి ఉన్న ఒక ప్యాకెట్‌, రూ.5 వేల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కింద కేసు నమోదు చేశారు.

యువతకు పోలీసుల హెచ్చరిక

Advertisement

గంజాయి సాగు, విక్రయాలు, వినియోగం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి సాగు, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Also read: హుజురాబాద్‌లో డేంజర్ బెల్స్.. పొంచి ఉన్న భారీ ప్రమాద ముప్పు!

Tags

Related News

హుజురాబాద్‌లో డేంజర్ బెల్స్.. పొంచి ఉన్న భారీ ప్రమాద ముప్పు!

పింఛన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి?

ఐబొమ్మ రవిని మించిన మరో డిజిటల్ పైరసీ నెట్‌వర్క్.. ఒక్కో సినిమాకు రూ. 20 వేలు!

ఎవరీ రేష్మా డాన్? బ్యూటీషియన్‌గా పనిచేస్తూ రౌడీయిజం.. చివరికి ఏమైందంటే?

తెలంగాణలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..?

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ దుకాణం దగ్ధం

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా.. ఇలా అప్లై చేసుకోండి, ఇవే కొత్త రూల్స్

Big Stories

Advertisement
×