E-Paper
Advertisement

వంశీకి బిగ్ షాక్.. డైరెక్ట్ గా నామినేట్ చేసిన నాగార్జున.. సిగ్గుపడుతున్నానంటూ!

వంశీకి బిగ్ షాక్.. డైరెక్ట్ గా నామినేట్ చేసిన నాగార్జున.. సిగ్గుపడుతున్నానంటూ!
Advertisement

Bigg Boss 10 Telugu Day 76 Promo 3 : బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం 10 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని 11వ వారం కూడా పూర్తికాబోతోంది. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు రాబోతున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. ఈ వారం రామకృష్ణ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నట్టు సమాచారం. ఇక వీకెండ్ కావడంతో నాగార్జున ఎపిసోడ్ కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు ఈ ప్రోమో వీడియోలో భాగంగా టెంపర్ వంశీకి (Vamsi) బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చారు.

విలన్ వేషాలు వేయడమేనా…

ఈవారం నామినేషన్స్ లో భాగంగా టెంపర్ వంశీ మిగిలిన హౌస్ మేట్స్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడారు ఇలా బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించడంతో నాగార్జున(Nagarjuna) అందుకు సంబంధించిన వీడియోని ప్లే చేస్తూ వంశీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ వంశీ నువ్వు విలన్ లాగా వేషాలు వేయటమేనా లేకపోతే విలన్ లాగా మాట్లాడతావు కూడానా అంటూ ప్రశ్నించారు అనంతరం వీడియో ప్లే చేయడమే కాకుండా నీ ప్రవర్తన అసలే మాత్రం బాలేదని నువ్వు మాట్లాడిన తీరుకు నేనే సిగ్గుపడుతున్నానంటూ నాగార్జున క్లాస్ పీకారు.

టెంపర్ వంశీ డైరెక్ట్ నామినేషన్..

Advertisement

ఈ విధంగా వంశీ మాట్లాడినందుకు క్షమాపణలు తెలియజేస్తూ.. అలా మాట్లాడినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యానని తెలిపారు. ఇక తాను అలా మాట్లాడినందుకు ఏ పనిష్మెంట్ ఇచ్చిన తాను సిద్ధమేనని వంశీ మాట్లాడటంతో వెంటనే నాగార్జున నువ్వు డైరెక్ట్ గా నామినేట్ అవుతున్నావు అంటూ ఊహించని షాక్ ఇచ్చారు. తదుపరి వారంలో వంశీ నేరుగా నామినేషన్ లో ఉండబోతున్నారని తెలియజేశారు. ఇలా బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించిన నేపథ్యంలో వంశీకి మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు.

Advertisement

ఇక మిగిలిన కంటెస్టెంట్లతో కూడా నాగార్జున సరదాగా మాట్లాడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా నరేష్ మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు అయితే ఓట్లు తక్కువగా రావడంతో రామకృష్ణ చివరి స్థానంలో ఉన్నారని ఈ వారం రామకృష్ణ హౌస్ నుంచి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రామకృష్ణ బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఐదవ వారం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామకృష్ణ పదకొండవ వారం హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.

Also Read: ధనుష్ పొరపాటున ఇండస్ట్రీలోకి వచ్చారా?ఆ పని చేయడం అంత ఇష్టమా?

Related News

జానపదానికి డీజే టచ్.. మాధురి రాథోడ్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయ్ గా !

నోరు జారడం గురించి మళ్లీ మాట్లాడుకుందాం… త్రిగుణ్ కు క్లాస్ పీకిన నాగార్జున!

జాను లిరి ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

కులకడం అంటే మా ఇంట్లో చీపురు తిరిగేస్తారు.. రోహిత్ నాయుడు షాకింగ్ కామెంట్స్!

మౌనీరాయ్ సర్జరీ చేయించుకుందా.. విడాకుల తర్వాత నిజాలు బయటపెట్టిన భర్త!

స్టైలిష్ లుక్ లో పిచ్చెక్కిస్తున్న పెద్దోడు.. అమ్మాయిలు ఫిదా అవ్వాల్సిందే..!

Vindhya Vishaka : వింధ్య ఒక్క షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..?

Big Stories

Advertisement
×