E-Paper
Advertisement

కొత్త బైక్, వాహనాలు కొనేవారికి బిగ్ అలర్ట్.. డీలర్లకు సర్కార్ వార్నింగ్?

కొత్త బైక్, వాహనాలు కొనేవారికి బిగ్ అలర్ట్.. డీలర్లకు సర్కార్ వార్నింగ్?
Advertisement

HSRP Plates: స్వేచ్చ బ్యూరో: కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ నంబర్లు కేటాయించినా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) బిగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న డీలర్లకు తెలంగాణ రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్లేట్లు అమర్చిన వివరాలను ‘వాహన్‌’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 (రూల్‌ 50) ప్రకారం తయారీదారులు సరఫరా చేసే హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లను వాహనాలకు అమర్చే పూర్తి బాధ్యత డీలర్లదేనని పేర్కొంది. శనివారం మీడియా ప్రకటన విడుదల చేసింది.

హెచ్ఎస్ఆర్పీ వివరాలు..

వాహన్‌ పోర్టల్‌ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో 6,10,330 వాహనాలు రిజిస్టర్‌ కాగా, 4,56,298 వాహనాలకు మాత్రమే హెచ్ఎస్ఆర్పీ ప్రక్రియ పూర్తయిందని, ఇంకా 1,54,032 వాహనాలు పెండింగ్‌లో ఉన్నాయని రవాణాశాఖ పేర్కొంది.హెచ్ఎస్ఆర్పీ వివరాలు వాహన్‌లో నమోదైతేనే ఆర్‌సీ కార్డు ప్రింట్‌ అవుతుందని, డీలర్ల అలసత్వంతో లక్షలాది మంది వాహనదారులకు ఆర్‌సీలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హెచ్ఎస్ఆర్పీ లేకుండా రోడ్లపై తిరగడం ఎంఓఆర్టీటీహెచ్ మార్గదర్శకాలకు విరుద్ధం అని స్పష్టం చేసింది.

భారీ జరిమానాలు..

Advertisement

పెండింగ్‌ సమస్యపై రాష్ట్రంలోని అన్ని రిజిస్టరింగ్‌ అథారిటీలకు రవాణా శాఖ కీలక ఆదేశాలిచ్చింది. డీలర్ల వారీగా పెండెన్సీని సమీక్షించి, 7 రోజుల్లోగా హెచ్ఎస్ఆర్పీ బిగించి వాహన్‌లో అప్‌డేట్‌ చేయించాలని ఆదేశించింది. గడువు దాటితే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి భారీ జరిమానాలు, ట్రేడ్‌ సర్టిఫికెట్‌ సస్పెన్షన్‌, వాహన్‌ పోర్టల్‌లో డీలర్‌ లాగిన్‌ బ్లాక్‌ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీలర్లను హెచ్చరించింది.నిర్ణీత గడువులోగా ప్లేట్లు బిగించని డీలర్లపై కఠిన చర్యలు తప్పవని, హెచ్ఎస్ఆర్పీ లేదా ఆర్‌సీ అందని వాహనదారులు తమ డీలర్‌ను గానీ, సమీపంలోని ఆర్టీఏ కార్యాలయాన్ని గానీ సంప్రదించాలని సూచించింది.

Also Read: నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో?

Tags

Related News

ఇంట్లో దర్జాగా గంజాయి సాగు చేస్తున్న బీటెక్ విద్యార్థి!

హుజురాబాద్‌లో డేంజర్ బెల్స్.. పొంచి ఉన్న భారీ ప్రమాద ముప్పు!

పింఛన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి?

ఐబొమ్మ రవిని మించిన మరో డిజిటల్ పైరసీ నెట్‌వర్క్.. ఒక్కో సినిమాకు రూ. 20 వేలు!

ఎవరీ రేష్మా డాన్? బ్యూటీషియన్‌గా పనిచేస్తూ రౌడీయిజం.. చివరికి ఏమైందంటే?

తెలంగాణలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..?

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ దుకాణం దగ్ధం

Big Stories

Advertisement
×