BigTV English

Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్

Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్

Ts High Court: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్ తగిలింది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టిపారేసింది. సీబీఐ విచారణకే మొగ్గుచూపింది.


సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం అడగగా.. అందుకు కూడా నిరాకరించింది.

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేయగా… ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు కొనసాగించింది. ఈక్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు ఆదేశించగా.. ఇవ్వొద్దంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిచింది.


ఈక్రమంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్డి తీర్పునిచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా రద్దు చేశారు. ఈక్రమంలో సింగిల్ జడ్డి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. అయితే డివిజన్ బెంచ్ కూడా సర్కార్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×