E-Paper
Advertisement

Akhil Akkineni:‘వైల్డ్ సాలే’ అంటున్న అఖిల్‌.. రిలీజ్ డేట్ ప్ర‌కటించేశారు

Akhil Akkineni:‘వైల్డ్ సాలే’ అంటున్న అఖిల్‌.. రిలీజ్ డేట్ ప్ర‌కటించేశారు
Advertisement

Akhil Akkineni:అఖిల్ అక్కినేని తన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ మూవీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైన‌ప్ప‌టికీ త‌ను మాత్రం కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయ‌లేదు. సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు త‌ను కూడా ఎగ్జ‌యిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాడు. అయితే గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కొన్ని షూటింగ్స్ పెండింగ్ ఉండిపోవ‌టం.. రీ షూట్స్ వంటి కార‌ణాల‌తో ‘ఏజెంట్’ సినిమా రిలీజ్‌ను వాయిదాలు వేశారు. 2023 సంక్రాంతికి కూడా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ థియేట‌ర్స్ స‌మ‌స్య రావ‌టంతో అఖిల్ వెన‌క్కి త‌గ్గాడు.

మార్చి, ఫిబ్ర‌వ‌రి అంటే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇన్ని టెన్ష‌న్స్‌లో విడుద‌ల చేయ‌టం ఎందుక‌ని అనుకున్నాడేమో అందుక‌ని త‌న ‘ఏజెంట్’ సినిమాను స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి అఖిల్ అండ్ టీమ్ డిసైడ్ అయ్యారు. తాజాగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కూడా అలాగే ఉంది. ‘ఏజెంట్’ సినిమాను ఏప్రిల్ 28న తీసుకొస్తున్నారు. అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. దీని కోసం స్పెష‌ల్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఓ టెర్రరిస్ట్ గ్రూపుకి చెందిన వ్య‌క్తిని అఖిల్‌ను క‌ట్టేసి ర‌క్తం వ‌చ్చేలా కొట్టి సాలా అని తిడ‌తాడు. అప్పుడు సాలా అని కాదు.. వైల్డ్ సాలా అని పిలువు అంటూ అఖిల్ చెబుతాడు. చాలా రోజుల ముందు విడుద‌లైన టీజ‌ర్‌, ఇప్పుడు విడుద‌లైన ప్రోమో చూస్తే అఖిల్ సినిమా కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్డ‌ట్టు క‌నిపిస్తుంది.

Advertisement

‘ఏజెంట్’ మూవీ కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా విడుద‌లయ్యాయి. ఈ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌లో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర సినిమాను నిర్మించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×