E-Paper
Advertisement

TSPSC : హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వార్డెన్‌ పోస్టుల భర్తీ.. అర్హతలివే..!

TSPSC : హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వార్డెన్‌ పోస్టుల భర్తీ.. అర్హతలివే..!
Advertisement

TSPSC : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో 562 సంక్షేమాధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు 2023 జనవరి 6 నుంచి జనవరి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులు ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 లో మొత్తం 140 పోస్టులున్నాయి. అందులో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 పోస్టులు ఉన్నాయి.

పోస్టును అనుసరించి ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈడీ, డీఈడీ చేసి ఉండాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2022 జూలై 01 నాటికి 44 ఏళ్లు మించరాదు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, నల్గొండ లో రాత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆగస్టులో ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

Advertisement

అర్హతలు: పోస్టును అనుసరించి ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈడీ, బీఈడీ/ డీఈడీ (విజువల్‌ హ్యాండిక్యాప్డ్‌/ హియరింగ్‌ హ్యాండిక్యాప్డ్‌)
వయసు: 01/07/2022 నాటికి 44 సంవత్సరాలు మించరాదు
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 06.01.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 27.01.2023
దరఖాస్తు, పరీక్ష రుసుం: రూ.280
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్‌ టైప్‌): ఆగస్టు-2023
రాత పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, నల్గొండ.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×