
Pan Aadhar Link : ఆధార్‌కు పాన్ కార్డును లింక్ చేసుకోలేదా..? అయితే మీకిదే లాస్ట్ ఛాన్స్ అంటోంది ఐటీ శాఖ. 2023 మార్చి 31లోపు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయకపోతే, ఏప్రిల్ 1నుంచి పాన్ కార్డు రద్దవుతుందని హెచ్చరించింది.
ఐటీ చట్టం 1961 ప్రకారం.. పన్ను మినహాయింపు పరిధిలోకి రాని పాన్ హోల్డర్లు అందరూ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరని పేర్కొంది. ఒకవేళ లింక్ చేయకపోతే… ఐటీ చట్టం ప్రకారంగా ఎదురయ్యే పరిణామాలన్నింటికీ పాన్ కార్డుదారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, పలు ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందని డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
పాన్ కార్డు పని చేయకపోతే ఐటీ రిటర్నులును ఫైల్ చేయలేరని, పెండింగ్‌లో ఉన్న రిటర్న్ ప్రాసెస్ చేయబడవని గుర్తు చేసింది. ఆ తరువాత పాన్ కార్డులను అనుసంధానించడం కూడా సాధ్యం కాదని తెలిపింది. అందువల్ల వెంటనే పాన్ కార్డులను, ఆధార్‌కు అనుసంధానించాలని కేంద్ర ఆదాయ పన్నుల శాఖ సూచించింది.
పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానానికి చివరి తేదీ 2023 మార్చి 31 అని ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఇన్‌కం టాక్స్ యాక్ట్-1961 ప్రకారం పాన్ కార్డు దారులంతా ఆధార్ కార్డును అనుసంధానించాల్సిందేనని ఐటీ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ స్పష్టం చేసింది.