E-Paper
Advertisement

Vespa Scooter: మామూలు స్కూటరే.. ధర మాత్రం ఆరున్నర లక్షలు.. ఎందుకంటే?

Vespa Scooter: మామూలు స్కూటరే.. ధర మాత్రం ఆరున్నర లక్షలు.. ఎందుకంటే?
vespa

Vespa Scooter: బైక్ అంటే చాలామందికి మోజే. స్కూటర్ అంటే కాస్త చిన్నచూపే. రేసులకు గట్రా పనికిరాదని.. సింపుల్ రైడింగ్‌కు మాత్రమేనని.. అమ్మాయిలే ఎక్కువగా వాడుతారని.. స్కూటర్లను తక్కువగా చూస్తుంటారు. ధర కూడా బైక్ కంటే తక్కువే ఉంటుంది. కానీ, ఆ స్కూటర్ మాత్రం సంథింగ్ స్పెషల్. అది అన్నిటిలా మామూలు వెస్పా స్కూటరే. కానీ, ధర మాత్రం ఏకంగా ఆరున్నర లక్షలు.

150 సీసీ ఇంజిన్‌.. యూరో 5 ప్రమాణాలు.. 8 లీటర్ల ఫ్యూయల్‌ కెపాసిటీ.. ఇలా సాధారణ ఫీచర్లే ఉన్నాయి. వైట్ అండ్ వైట్ కలర్‌లో ఉంటుంది. మరి, ఏ స్పెషాలిటీ లేకుండా వెస్పా స్కూటర్‌కు ఎందుకంత ధర? ఆరున్నర లక్షలంటే మాటలా?

ఒకే ఒక్క రీజన్. అందుకే వెస్పా స్కూటర్‌ అంత కాస్ట్లీ. అదే, పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌. అవును, జస్టిన్‌ బీబర్‌ ఎక్స్‌ ఎడిషన్‌ పేరుతో స్కూటర్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది పియాజియో సంస్థ. బీబర్‌తో ఒప్పందం చేసుకుని.. పాప్ స్టార్ ఐడియాలజీతో స్కూటర్‌ను డిజైన్ చేశామని చెబుతోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ అని.. పరిమిత సంఖ్యలో మాత్రమే అమ్ముతామని ప్రకటించింది.

ఇదీ సంగతి. జస్టన్ బీబర్ థీమ్‌.. లిమిటెడ్ ఎడిషన్ వల్లే.. రూ.లక్ష లోపు ఉండాల్సిన మామూలు స్కూటర్‌ను.. ఆయన పేరు చెప్పి ఏకంగా ఆరున్నర లక్షలకు అమ్మేస్తున్నారు. బిజినెస్ స్ట్రాటజీ అంటే ఇదేనేమో. ఇండియాలో ముందుగా ఆర్డర్ చేస్తే.. ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసి.. డెలివరీ ఇస్తారట. రెగ్యులర్ కస్టమర్ల కోసం కాకుండా.. బైక్ కలెక్షన్‌‌పై క్రేజ్ ఉన్న సంపన్నుల కోసమే ఇలాంటి ఐడియాలన్నీ అంటున్నారు.

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

×