BigTV English

Telangana Bjp Candidate: బీజేపీ అభ్యర్థి మాదవీలతకు Y+ సెక్యూరిటీ.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

Telangana Bjp Candidate: బీజేపీ అభ్యర్థి మాదవీలతకు Y+ సెక్యూరిటీ.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు


Telangana Bjp Candidate: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ విరించి ఆస్పత్రి చైర్ పర్సన్ మాదవీలత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచినా ఏ ప్రధాన పార్టీకైనా హైదరాబాద్ సీటు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ తరుణంలోనే బీజేపీ హైదరబాద్ ఎంపీ సీటును మాదవీలతకు కట్టబెట్టింది. ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాదవీలతకు హై సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాదవీలతకు వై ప్లస్ భద్రతను కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మాదవీలత ప్రస్తుతం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీపై పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మాదవీలతకు సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మాదవీలతకు కేటాయించిన సెక్యూరిటీలో 11 మంది పోలీసు సిబ్బంది ఉండనున్నారు. మరోవైపు ఆరుగులు సీఆర్పీఎఫ్ ఆఫీసర్లు, ఐదుగురు హొంగార్డ్స్ ఉండనున్నారు.


ఇక మాదవీలత గురించి చెప్పాలంటే ఈమె యాకత్ పురాలోని సంతోశ్ నగర్ లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు కూడా పూర్తి చేశారు. అనంతరం ఆర్టిస్ట్, ఫిలాసఫర్, భరతనాట్య నృత్యకారిణిగా, ఎంటప్రిన్యూర్ గా కూడా మాదవీలత పని చేశారు. ప్రస్తుతం ఈమె కొంతకాలంగా ఆధ్యాత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ ను ఈమె 2001లో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఈమె లతామా ఫౌండేషన్ కు చైర్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈమె హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాతబస్తీలో ఈ మేరకు గోశాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో అసదుద్ధీన్ ఓవైసీని ఓడించి తాను విజయకేతనం ఎగురవేస్తానంటూ సవాల్ చేశారు మాతవీలత. ఈ నేపధ్యంలో హైదరాబాద్ ఎంపీ సీటుపై ఆసక్తి నెలకొంది.

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×