United Breweries Group: బీరు ప్రియులకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. నిన్నటి వరకు కింగ్ ఫిషర్ బీర్లు లభించక ఉసూరు మంటున్న బీరు ప్రియులకు యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్లను సరఫరా చేస్తుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ధరల పెరుగుదల లేకపోవడం, పాత బకాయిలు విడుదల కాకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటన జారీ చేసింది.
ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడ సీరియస్ గా తీసుకుంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సైతం సంబంధించిన అధికారులతో సమావేశమై, బీరు ప్రియులకు బీర్ల కొరత లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం స్పందించి, యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ తో చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలతో వస్తున్న నష్టాల కారణంగా తాము తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బీర్ల సరఫరాను నిలిపి వేశామని, అందులో ఎటువంటి దురుద్దేశం లేదంటూ సంస్థ ప్రకటించింది. అయితే సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించడంతో, మళ్లీ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ తాజాగా ప్రకటన జారీ చేసింది.
వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మద్యంతర నిర్ణయం తీసుకున్నట్లు కింగ్ ఫిషర్ బీర్ల తయారీ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటనపై బీర్ల ప్రియులు పెదవి విరుస్తున్నారు. పండగ సమయంలో అందుబాటులో లేని కింగ్ ఫిషర్ బీర్లు, ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం ఏమిటని, బీరు ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా నేటినుండి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై స్పందించిన యూబీ సంస్థ
బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్
బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూల స్పందన
త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ… pic.twitter.com/KnIR7R8jTc
— BIG TV Breaking News (@bigtvtelugu) January 20, 2025