BigTV English

Emergency : కంగనా “ఎమర్జెన్సీ”… మూడు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..!

Emergency : కంగనా “ఎమర్జెన్సీ”… మూడు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..!

Emergency : బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. ఎన్నో ఆటంకాలు దాటి ఈ నెల 17న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా కాస్త వెనుకు పడిందనే చెప్పాలి. ఈ మూడు రోజుల్లో కేవలం రూ.10కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది.


1975 ఎమర్జన్సీ.. ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీ ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చేసింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ పర్మిషన్ తో ఈ నెల 17న రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా చూస్తే మొదటి రోజు నుంచి  కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. రూ.25కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. మూడు రోజులు రూ. 10 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. మొదటి రోజు 2.5 కోట్లు, రెండో రోజు 3.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మూడో రోజు 4.25 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. ఇందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. మహిమా చౌదరి కీలకపాత్రలో కనిపించారు. ఇందులో జయప్రకాష్ నారాయణ పాత్రలో అనుపమ కేర్, అటల్ బిహారీ వాజ్పేయిగా శ్రేయాస్ తల్పడే నటించారు. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. ఇందులో డైలాగ్స్ తో పాటు కంగనా పాత్ర ఆకట్టుకునేలా ఉంది.


ALSO READ : Triptii Dimri : నేచర్ లో ‘యానిమల్ బ్యూటీ’ సైక్లింగ్ కు నెటిజన్స్ ఫిదా

వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడితే వచ్చింది. కొన్ని వర్గాలు ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మధ్యప్రదేశ్ లో ఓవర్గం ఈ సినిమాను ఆపివేయాలని.. ఇందులో తమను తక్కువగా చేసి చూపిస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు ఈ వర్గం వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డును సూచించింది.

ఇంతే కాకుండా శిరోమణి ఆకాలీదత్ సైతం ఈ సినిమాను నిలిపివేయాలని కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కంగనా, చిత్ర నిర్మాణ సంస్థ జై ఎంటర్టైన్మెంట్స్ బాంబే హైకోర్టును సంప్రదించి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరాయి. ఈ విషయంపై తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసేసింది.

ఈ సినిమా చిత్రీకరణ నుంచి ఎన్నో ఆటంకాలు ఎదుర్కుంటూ వచ్చింది. సెన్సార్ బోర్డ్ వద్ద సైతం ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. రిలీజ్ కు ముందే కాకుండా ఆ తర్వాత కూడా ఎమర్జెన్సీ ఎన్నో ఆరోపణలు ఎదుర్కుంది. బంగ్లాదేశ్ లో ఈ సినిమాను నిషేధించినట్టు సమాచారం. భారత్ తో బంగ్లాదేశ్ కు ఉన్న సంబంధాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉందని.. కంటెంట్ పరంగా కంటే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా సినిమాను బ్యాన్ చేసినట్టు ఓ నేషనల్ మీడియా పేర్కొంది.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×