E-Paper
Advertisement

Uppal Crime: ఉప్పల్ లో దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం

Uppal Crime: ఉప్పల్ లో దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం
Advertisement
Hyderabad latest updates

Uppal Crime news(Hyderabad latest updates):

రద్దీ ప్రాంతమైనా.. నిర్మానుష్య ప్రదేశమైనా.. ఎక్కడున్నా సరే.. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతినిత్యం దేశంలో పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతుంటే.. వాటిలో వెలుగు చూసేవి కొన్నిమాత్రమే. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో మరో దారుణం వెలుగుచూసింది. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ కు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. పాతబస్తీకి చెందిన షేక్ సాదక్ (60) ఉప్పల్ బస్టాండ్ ప్రాంతంలోని ఒక కట్టెల మిషన్ లో పనిచేస్తున్నాడు. జనవరి3న ఉప్పల్ బస్ స్టాప్ లో బాలిక బస్సుకోసం ఎదురుచూస్తుండగా.. సాదక్ తెలిసిన వ్యక్తిలాగే ఆమెను పేరుతో పిలిచాడు. మీ అమ్మనాన్న నాకు తెలుసని నమ్మించి.. ఇంటికెళ్దాం రమ్మని తీసుకెళ్లాడు.

Advertisement

అక్కడికి కొద్ది దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పరారయ్యాడు. బాధిత బాలిక ఇంటికి ఆలస్యంగా చేరుకోవడం, ఆమె ముభావంగా ఉండటంతో.. కుటుంబ సభ్యులు ఏమైందని నిలదీశారు. విషయం తల్లికి చెప్పగా.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడపిల్లలు, యువతులు జాగ్రత్తగా ఉండాలని.. ఎంత తెలిసిన వారినైనా సరే నమ్మొద్దని పోలీసులు సూచించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×