BigTV English

Vasalamarri | అనాథగా మారిన కేసీఆర్ దత్తత గ్రామం.. రోడ్డున పడిన గ్రామస్థులు

Vasalamarri | మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి ఇప్పుడు అనాథ అయింది. సారు అధికారంలో ఉన్నన్ని రోజులు రేపు రేపు అంటూ ఊరించి ఊరించి పక్కన పడేయడంతో వారి కథ టోటల్ రివర్స్ అయింది. ఎటు చూసినా సగం కూలిన ఇండ్లు, భవిష్యత్ పై భరోసాలేని బతుకులు.. ఇదీ నేటి బంగారు వాసాలమర్రి. ఏండ్లకేండ్లు గడిచిపోయాయి తప్ప వారి తలరాత మారలేదు. బంగారు వాసాలమర్రి కాస్తా బంగాళాఖాతంలో కలిసిపోయినంత పరిస్థితి వచ్చింది. బంగారం కాదు దరిద్రంగా మార్చేసి పోయారంటూ కేసీఆర్ పై గరంగరం అవుతున్నారు.

Vasalamarri | అనాథగా మారిన కేసీఆర్ దత్తత గ్రామం.. రోడ్డున పడిన గ్రామస్థులు

Vasalamarri | మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి ఇప్పుడు అనాథ అయింది. సారు అధికారంలో ఉన్నన్ని రోజులు రేపు రేపు అంటూ ఊరించి ఊరించి పక్కన పడేయడంతో వారి కథ టోటల్ రివర్స్ అయింది. ఎటు చూసినా సగం కూలిన ఇండ్లు, భవిష్యత్ పై భరోసాలేని బతుకులు.. ఇదీ నేటి బంగారు వాసాలమర్రి. ఏండ్లకేండ్లు గడిచిపోయాయి తప్ప వారి తలరాత మారలేదు. బంగారు వాసాలమర్రి కాస్తా బంగాళాఖాతంలో కలిసిపోయినంత పరిస్థితి వచ్చింది. బంగారం కాదు దరిద్రంగా మార్చేసి పోయారంటూ కేసీఆర్ పై గరంగరం అవుతున్నారు.


ఎటు చూసినా సగం కూల్చిన ఇండ్లు.. కవర్లతో కప్పిన ఇండ్లు… ఊరి మధ్యలో అద్భుతమైన రోడ్డు తప్ప వాసాలమర్రిలో ఇంకేమీ లేదు. బతుకులు రోడ్డున పడ్డాయి. మాజీ సీఎం కేసీఆర్ హామీలతో ఊరికి ఊరే ఆగమైంది. ఒక్కటీ నెరవేరక వాసాలమర్రి వాసులు చౌరస్తాలో నిల్చున్నారిప్పుడు.

మాజీ సీఎం కేసీఆర్​ దత్తత తీసుకున్న వాసాలమర్రి పరిస్థితి.. అగమ్యగోచరంగా మారిపోయింది. దత్తత పేరుతో మూడేండ్లుగా సర్వేల మీద సర్వేలు చేస్తూ, హైప్ క్రియేట్ చేసినా ఏదీ జరగలేదు. ఓసారి ఊరంతటికీ ఒకసారి మాత్రమే దావత్ ఇచ్చి 150 కోట్ల విలువైన హామీలతో గ్రామస్థులను ఊహల్లో ఊరేగించారు. వాసాలమర్రిని దత్తత తీసుకొని మూడేళ్లు గడిచినా గ్రామ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ గ్యాప్ లోనే బీఆర్ఎస్​ సర్కారు పోయి కాంగ్రెస్ అధికారంలోకి​ వచ్చింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో తెలియక వాసాలమర్రి గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.


యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని 2020 నవంబర్​ 1న అప్పటి సీఎం కేసీఆర్​ దత్తత తీసుకున్నారు. 150 కోట్లకు పైగా ఖర్చుచేసి గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని ప్రకటించారు. దత్తత తీసుకున్న 10 నెలల దాకా వాసాలమర్రి ఊసెత్తని కేసీఆర్..​ ఆ తర్వాత ఉన్నట్టుండి పాత ఇండ్లు కూల్చేసి అందరికీ కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు. సీన్ కట్ చేస్తే కొన్ని ఇండ్లు కూలగొట్టారు. కొన్ని మొండి గోడలతో ఉండిపోయాయి. ఇంకొన్ని ప్లాస్టిక్ కవర్లతో కప్పి పెట్టి ఉంచారు. అదీ పరిస్థితి. బంగారు వాసాల మర్రి చేస్తా అని చెప్పి దరిద్రంగా చేసి పోయాడంటూ శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది.

అంతే కాదు.. వాసాలమర్రిలోని యువతకు ఉపాధి కల్పిస్తామని, ప్రతి ఇంటికి పాడి గేదె, అవసరమైన వారికి ట్రాక్టర్లు అందజేస్తామని ఊరించారు. ప్రభుత్వం నుంచి సాయం పొందని ఇల్లు, మనిషే ఉండకూడదంటూ కేసీఆర్​ చెప్పుకొచ్చారు. ఊరి అభివృద్ధి కోసం 150 కోట్లతో ఒకసారి, 165 కోట్లతో మరోసారి డీపీఆర్​ రూపొందించి ఉన్నతాధికారులకు పంపినా వాటిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. చింతమడక నుంచి ఆర్కిటెక్స్​ వచ్చి పలుమార్లు సర్వేల మీద సర్వేలు చేసి ప్లాన్​ రూపొందించడమే కాకుండా మార్కింగ్​ చేశారు. ఆ తర్వాత కొత్తగా ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వవద్దని ఆఫీసర్లకు ఇంటర్నల్​ ఆర్డర్స్​ జారీ చేశారు. ఇదే ట్విస్ట్ మరి.

మాజీ సీఎం కేసీఆర్ 150 కోట్ల గురించి చెబితే…​ స్పెషల్​ డెవలప్​మెంట్ ఫండ్​ కింద 58.57 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్​ 18న జీఓ 159 జారీ చేశారు. అందరికీ కండ్లు చెదిరే బంగ్లాలు కట్టిస్తారని ఊహిస్తే 5 లక్షల చొప్పున 24.24 కోట్లతో మొత్తం 481 డబుల్​ బెడ్​ రూం ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో వాసాలమర్రి గ్రామస్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సర్కారు కట్టే ఇండ్ల కంటే తాము ఉంటున్న ఇండ్లే బెటర్​ అనే ఆలోచనకు వచ్చి, ఆ అమౌంట్ ఎటూ సరిపోదనుకుని… పాత ఇండ్లు కూల్చేందుకు చాలా మంది ముందుకు రాలేదు. పైగా వాసాలమర్రిలో ఇంటికొక జాబ్ అని చెప్పినా ఏ ఒక్కరికీ ఇవ్వలేదంటున్నారు. ఆఫీసర్లు ఎప్పుడు సర్వేకు వచ్చినా టార్చర్ పడ్డామంటున్నారు వాసాలమర్రి గ్రామస్తులు. కేసీఆర్ ప్రభుత్వం పోవడంతో ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నామంటున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×