E-Paper
Advertisement

తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర.. డీజీపీకి వీసీ జానయ్య లేఖ

తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర.. డీజీపీకి వీసీ జానయ్య లేఖ
Advertisement

Aldas Janaiah: యూనివర్సిటీ బదిలీల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నవంబర్ 9, 2026న ఆయన స్వయంగా డీజీపీకి లేఖ సమర్పించారు.

బదిలీ కోపంతోనే నిందలు!

Advertisement

గత నవంబర్ 7న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఒక మహిళా ఫ్యాకల్టీ సభ్యురాలు వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 2026 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో తనను వేధించారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను వీసీ పూర్తిగా ఖండించారు. గత సెప్టెంబర్ 11, 2026న నిబంధనల ప్రకారమే సదరు ఫ్యాకల్టీని రుద్రూర్ ఫుడ్ సైన్స్ కాలేజీకి బదిలీ చేశామని, ఆ కోపంతోనే తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు 11 నెలల తర్వాత ఈ అబద్ధపు ప్రచారానికి దిగారని ఆయన స్పష్టం చేశారు.

కాల్ డేటా, చాట్స్ విచారించాలని విజ్ఞప్తి

Advertisement

సత్యనిష్ఠను నిరూపించుకునేందుకు వీసీ స్వయంగా విచారణకు సిద్ధమయ్యారు. గత 5 ఏళ్లకు సంబంధించిన రికార్డులతో పాటు, వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు, కాల్ హిస్టరీలను సమగ్రంగా పరిశీలించాలని డీజీపీని కోరారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చి, నిష్పాక్షిక విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Also Read:రైతులకు భట్టి విక్రమార్క భరోసా.. పంట రుణాలపై కీలక ప్రకటన! 

Tags

Related News

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?

హైదరాబాద్‌లోని కోఠి డిఎంఈ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్లు అరెస్ట్!

రైతులకు భట్టి విక్రమార్క భరోసా.. పంట రుణాలపై కీలక ప్రకటన!

సిద్దిపేట వేదికగా రక్షణసేన బిగ్ ప్లాన్.. 13న భూమిపూజతో కేడర్‌లో కొత్త జోష్!

బిర్యానీ ఆలస్యమైందని ప్రశ్నిస్తే.. కత్తులతో దాడి చేసిన యాజమాన్యం!

భాగ్యనగరంలో తాగు నీటి కష్టాలకు చెక్‌.. 15 నుంచి గోదావరి జలాలు! శరవేగంగా సాగుతున్న పనులు

ఓంకారేశ్వర ఆలయానికి రూ. 1,108 కోట్లా.. జీవో 928ని రద్దు చేయాలన్న FGG!

Big Stories

Advertisement
×