E-Paper
Advertisement

ఓంకారేశ్వర ఆలయానికి రూ. 1,108 కోట్లా.. జీవో 928ని రద్దు చేయాలన్న FGG!

ఓంకారేశ్వర ఆలయానికి రూ. 1,108 కోట్లా.. జీవో 928ని రద్దు చేయాలన్న FGG!
Advertisement

Omkareshwar Temple: మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లో ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధి పనుల కోసం ఏకంగా 1,108.27 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గత అక్టోబర్ 7న జీవో నంబర్ 928ని జారీ చేసింది. అయితే ఈ ఖర్చుపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు MRDCL చైర్‌పర్సన్‌కు లేఖ రాస్తూ.. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది.

ఆలయాల అభివృద్ధికే వేల కోట్లా?

Advertisement

రాష్ట్రంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలను వివిధ ఆధ్యాత్మిక, ఉత్సవాల కోసం కేటాయిస్తున్నట్లు ఫోరం తన లేఖలో పేర్కొంది. వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే 1,000 కోట్లు కేటాయించామని ప్రభుత్వం తెలిపింది. గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధికి మొత్తం 2,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారని గుర్తుచేసింది. ఇందులో భాగంగానే భద్రాచలం ఆలయ అభివృద్ధికి 276 కోట్లు, బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 354 కోట్లు కేటాయించారని.. ఇక సమ్మక్క-సారలమ్మ జాతర కోసం దాదాపు 800 కోట్లు ఖర్చు చేశారని ఆ లేఖలో ప్రస్తావించింది.

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తీవ్ర అభ్యంతరం!

Advertisement

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, ఇలాంటి తరుణంలో మతపరమైన కార్యక్రమాలు, ఆలయాల అభివృద్ధి కోసం వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం సరైన ప్రాధాన్యత కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాదిస్తోంది. ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. కాబట్టి ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.1,108 కోట్ల పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన అన్నపరెడ్డి.. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు!

Tags

Related News

రేవంత్ రెడ్డి సైలెంట్ వార్నింగ్స్.. అయినా తగ్గని హస్తం నేతల రచ్చ!

ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీతో కీలక భేటీ!

సిద్దిపేటలో హరీష్ రావు ఖేల్ ఖతం.. డిపాజిట్ కూడా రాదు!- చనగాని దయాకర్

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం.. పూర్తిగా నుజ్జైన వాహనం, హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం

గోడకి కన్నం వేసి.. జ్యూవెలరీ షాపునే దోచేశారు, మేడ్చల్‌లో కలకలం

గల్లీలో కేడీ.. ఢిల్లీలో మోదీ.. ఎవరినైనా తొక్కుకుంటూ పోతా!- రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!

Big Stories

Advertisement
×