E-Paper
Advertisement

రైతులకు భట్టి విక్రమార్క భరోసా.. పంట రుణాలపై కీలక ప్రకటన!

రైతులకు భట్టి విక్రమార్క భరోసా.. పంట రుణాలపై కీలక ప్రకటన!
Advertisement

Farmer Loans: రైతుల కష్టాలు, కరవు పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 365 మండలాలు కరవు తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. వీటిలో 111 మండలాలు మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో దెబ్బతిన్న రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

రైతులకు అండగా బ్యాంకింగ్ రంగం

Advertisement

కరవు సవాలు విసురుతున్న ఈ సమయంలో పాత రుణాల వసూళ్ల కోసం ఒత్తిడి చేయకుండా, ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాటిని రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేయాలని భట్టి విక్రమార్క కోరారు. రబీ సీజన్ కోసమని బ్యాంకులు నిర్దేశించుకున్న రూ.38,268 కోట్ల రుణాలను తక్షణమే పంపిణీ చేయాలన్నారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కొత్త పంట రుణాలు ఇచ్చేలా ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ప్రత్యామ్నాయ సాగు.. అదనపు ఉపాధి

Advertisement

నీటి ఎద్దడి దృష్ట్యా తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ సాగుకు ఉదారంగా రుణాలు అందించాలని, అలాగే పాడి, పౌల్ట్రీ, పశుపోషణ వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల ద్వారా ఈ సీజన్‌లో కనీసం 10 నుండి 15 శాతం రైతు కుటుంబాలకు అదనపు ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు.

మహిళలు, యువతకు ఊతం

మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుతం ఇస్తున్న రుణాలకు అదనంగా ఒక్కో సంఘానికి రూ.2 లక్షల వరకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి రుణాలు వెంటనే మంజూరు చేయాలని సూచించారు. విద్యుత్ డిమాండ్ అక్టోబర్ 16న రికార్డు స్థాయిలో 20,818 మెగావాట్లకు చేరిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ఏకంగా రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతులు మళ్లీ నిలదొక్కుకునే వరకు బ్యాంకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.

Also Read: సిద్దిపేట వేదికగా రక్షణసేన బిగ్ ప్లాన్.. 13న భూమిపూజతో కేడర్‌లో కొత్త జోష్!

Tags

Related News

సిద్దిపేట వేదికగా రక్షణసేన బిగ్ ప్లాన్.. 13న భూమిపూజతో కేడర్‌లో కొత్త జోష్!

బిర్యానీ ఆలస్యమైందని ప్రశ్నిస్తే.. కత్తులతో దాడి చేసిన యాజమాన్యం!

భాగ్యనగరంలో తాగు నీటి కష్టాలకు చెక్‌.. 15 నుంచి గోదావరి జలాలు! శరవేగంగా సాగుతున్న పనులు

ఓంకారేశ్వర ఆలయానికి రూ. 1,108 కోట్లా.. జీవో 928ని రద్దు చేయాలన్న FGG!

రేవంత్ రెడ్డి సైలెంట్ వార్నింగ్స్.. అయినా తగ్గని హస్తం నేతల రచ్చ!

ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీతో కీలక భేటీ!

సిద్దిపేటలో హరీష్ రావు ఖేల్ ఖతం.. డిపాజిట్ కూడా రాదు!- చనగాని దయాకర్

Big Stories

Advertisement
×