Biryani Attack: హైదరాబాద్‌లో ఓ సంఘటన సంచలనం రేపింది. బీఎన్‌రెడ్డి నగర్ బిర్యానీ సెంటర్‌లో వ్యక్తి పై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని అతిధి బిర్యానీ సెంటర్‌లో యుకులు మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షనలో ఓ యువుడికి తీవ్ర గాయాలయ్యాయి. యుకువుల బిర్యానీ తినడానికి వచ్చారు. దీంతో బిర్యానీ కాస్త ఆలస్యమైందని యువకులు గొడవక దిగారు. దీంతో హోటల్ యాజమాన్యం అనుచరులు యువకులపై కత్తితో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో మిధాని కాలనీకి చెందిన రమేష్ గౌడ్, మల్లేష్, శివ, రాకేష్‌లపై దాడి జరిగినట్టు అక్కడి స్థానికులు తెలిపారు.
అయితే బాధితుడు మల్లేష్ కనుబొమ్మ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం బీరు బాటిళ్లతో బెదిరింపులు చేస్తూ చంపేస్తామంటూ రచ్చ రచ్చ చేశారు. దాడి సమయంలో 25 వేల నగదు, ఫోన్లు మాయమయ్యాయని బాధితుల ఆరోపణలు చేశారు. గాయపడిన యుకులను వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్చి వారికి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ కింద సమాధి.. దీపావళి అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?