Pawan Kalyan Annaa Divorce: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నా లెజినోవా(Anna Lezhneva) విడాకుల వార్తలు సంచలనంగా మారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట ఉన్నఫలంగా తమ విడాకుల (Divorce News)వార్తలను ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. దాదాపు 13 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరూ విడిపోవడం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా విడాకులు తీసుకొని విడిపోయారనే వార్త అభిమానులకు జీర్ణించుకోలేనిదని చెప్పాలి.
ఇకపోతే అన్నా లెజినోవా గత కొద్ది రోజుల క్రితమే తన విడాకులకు సంబంధించిన విషయాన్ని అభిమానులకు హింట్ ఇచ్చారు. కానీ ఈ విషయాన్ని అభిమానులు పెద్దగా గమనించలేదని చెప్పాలి. అన్నా లెజినోవా ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు అయితే ఈమె ఈ ఏడాది మార్చి నెలలో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు .ఈమె ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు అలాగే తన ఇంటి పేరును కూడా కొణిదెలగా మార్చుకున్నట్టు తెలిపారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె ఒక్కసారిగా ఇంస్టాగ్రామ్ డీ యాక్టివేట్ చేశారు. అయితే ఈమె ఇంస్టాగ్రామ్ కు దూరం కావడంతో ఎంతోమంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. ఇక తాజాగా వీరిద్దరూ తమ విడాకుల వార్తలను ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ,అన్నా లెజినోవా మధ్య ఉన్నటువంటి పరస్పర భేదాభిప్రాయాలు కారణంగానే ఈమె సోషల్ మీడియాకి కూడా దూరం అయ్యారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం విడిపోవాలని నిర్ణయం తీసుకున్న తరువాతనే ఈమె తన ఇంస్టాగ్రామ్ డీ యాక్టివేట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అమితమైన ప్రేమ ఉన్న అన్నా లెజినోవా ఇలా తన జీవితం నుంచి తప్పుకోవడానికి గల కారణం మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. ఈమె చివరిగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు(Pawan Birthday) సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక క్యూట్ ఫోటోని షేర్ చేశారు. ఈ పోస్ట్ అన్నా లెజినోవా ఇంస్టాగ్రామ్ వేదికగా పవన్ కళ్యాణ్ గురించి చేసిన చివరి పోస్ట్ అని చెప్పాలి. పవన్ పుట్టినరోజు తర్వాత ఈమె పూర్తిగా ఇంస్టాగ్రామ్ కు దూరమయ్యారు. ఈ కొద్దిరోజుల వ్యవధిలోనే వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయినప్పటికీ తమ పిల్లల కోసం ఎప్పుడు అండగా నిలుస్తామంటూ వీరిద్దరూ విడాకుల విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: సాటి మనుషుల పట్ల దయతో ఉండండి.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్!