E-Paper
Advertisement

ప్రిడిక్షన్ల పేరుతో నిలువునా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు.. నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు.. వీసీ స‌జ్జ‌నార్ వార్నింగ్

ప్రిడిక్షన్ల పేరుతో నిలువునా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు.. నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు.. వీసీ స‌జ్జ‌నార్ వార్నింగ్
Advertisement

IPL Betting Warning: ఐపీఎల్  క్రికెట్ ఫీవర్‌ను అడ్డుపెట్టుకుని సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా (X) వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండు నెలల పాటు సాగే ఈ క్రికెట్ పండుగను కొందరు అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ఒక ఉచ్చులా వాడుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం కమిషన్ల కోసం అసత్య ప్రచారాలు చేస్తూ, అమాయక యువతను ఈ జూదం ఊబిలోకి లాగుతున్నారని ఆయన హెచ్చరించారు. కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ పట్ల ఉన్న ఇష్టాన్ని జూదం వైపు మళ్లించి, అమాయకులను నిలువునా ముంచేలా ఈ బెట్టింగ్ ఊబి విస్తరిస్తోందని ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా వివరించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో టాస్ ఎవరిది? ఏ టీమ్ గెలుస్తుంది? వంటి ఫేక్ ప్రిడిక్షన్ ప్రకటనలతో నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. తాము ముందే ఫలితాలను ఖచ్చితంగా చెబుతామంటూ ఆశ చూపి, అమాయక ప్రజలను తమ ఛానెల్స్‌లో సబ్‌స్క్రైబ్ చేయించుకుంటున్నారు. ఒక్కసారి ఆ ఉచ్చులో పడితే, ఆకర్షణీయమైన ఆఫర్లతో వారిని బెట్టింగ్ వైపు నడిపిస్తూ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని స‌జ్జ‌నార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

ఈ అక్రమ ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల్లోనే పోలీసులు తీసుకున్న చర్యలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్న 494 పెయిడ్ ప్రకటనలను గుర్తించి తొలగించడం జరిగింది. ఈ మోసపూరిత ప్రకటనలను ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను పోలీసులు ఇప్పటికే బ్లాక్ చేయించారు.

ఈ నిఘా నిరంతరం కొనసాగుతుందని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఒకవేళ మీరు ఇలాంటి మోసపూరిత ప్రకటనల వల్ల డబ్బులు పోగొట్టుకున్నా లేదా ఇటువంటి అనుమానాస్పద ప్రకటనలు మీ దృష్టికి వచ్చినా వెంటనే స్పందించాలని పోలీసులు సూచించారు. బాధితులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని లేదా ప్రభుత్వ అధికారిక పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

Advertisement

Read Also: కర్రతో చిరుతను పరుగులు పెట్టించిన రైతు.. దెబ్బకి పరుగో పరుగు!

Related News

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

Big Stories

Advertisement
×