Vijayashanti: తెలంగాణ తల్లి విగ్రహంపై రగడ కంటిన్యూ అవుతోంది. విగ్రహం ప్రతిష్టాపన జరిగి వారం రోజులు గడిచిపోయింది. బీఆర్ఎస్ మాత్రం ఈ ఇష్యూ రైజింగ్ చేసే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా. బీఆర్ఎస్ నేతలు లేవనెత్తిన పలు అంశాలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశారు విజయశాంతి.
బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విజయశాంతి. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహంపై ఎక్స్‌లో రాసుకొచ్చారు ఆమె. గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందనేది ఆమె తొలి ప్రశ్న. 2007 ఏడాదిలో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు. బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతి రూపంగా బీఎస్ రాములు ఆ విగ్రహాన్ని చిత్రీకరించారని గుర్తు చేశారు.
కేవలం బీఆర్ఎస్ కార్యాలయాల్లోనే తెలంగాణ తల్లి విగ్రహాం ఆవిష్కరణ జరిగిందన్నారు. కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ అధికారికంగా తెలంగాణ తల్లి రూపానికి హోదా, గౌరవం, నిర్దేశ విధానాలు కల్పించలేదన్నారు.రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ తల్లిని మార్చిందని, ఈ విషయంలో మాట్లాడే హక్కు ముమ్మాటికీ బీఆర్ఎస్‌కు లేదని కుండబద్దలు కొట్టేశారు.
తల్లి తెలంగాణ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ మార్చిందని నాటి మన తెలంగాణా ఉద్యమకారులు దీనిపై కూడా కొట్లాడవచ్చు. బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా కొనసాగుతూ వస్తుందని గుర్తు చేశారు విజయశాంతి.
ALSO READ: బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. కూల్చివేతల జాబితాలో పార్టీ ఆఫీసు?
తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది? రాష్ట్ర వచ్చిన తర్వాత గడిచిన పదేళ్లలో జరిగిన మార్పులు విజయశాంతికి బాగా తెలుసు. సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో అప్పటి టీఆర్ఎస్‌లో ఆ పార్టీని కలిపారు రాములమ్మ. 2009లో మెదక్ నుంచి గెలిచి ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారామె.
కేసీఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగా ఆ పార్టీ రాంరాం చెప్పేశారామె. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతలు తలో విధంగా మాట్లాడుతున్నారు. కొందరేమో ఆ విగ్రహాన్ని గాంధీభవన్‌లో పెడతామని అంటున్నారు. ఈ వ్యవహారాల నేపథ్యంలో నేరుగా రాములమ్మ రంగంలోకి దిగేసింది. నేతల మాటలకు కౌంటరిచ్చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహంపై విజయశాంతి పోస్ట్..
2007 సంవత్సరంలో మొదటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్న విజయశాంతి
బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతిరూపంగా బీఎస్ రాములు చిత్రీకరించారు
బీఆర్ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది
కానీ పదేళ్ల బీఆర్ఎస్… pic.twitter.com/mE4H1SPHIC
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2024