Shiv Sena MLA Resign | మహారాష్ట్ర మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం పూర్తి అయింది. దీంతో మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు కూడ ‘మహా’ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే అధికార కూటమిలోని షిండే శివసేన పార్టీలో కీలక నాయకుడు నరేంద్ర భోండేర్ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీకి రాజీనామా చేశారు.
మహారాష్ట్రలోని భండరా – పావని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేంద్ర భోండేకర్ ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో విదర్భ ప్రాంతానికి పార్టీ కోర్డినేటర్ గా పనిచేశారు. విదర్భలో మొత్తం 62 సీట్లు ఉన్నాయి. ఈ 62 సీట్లలో అధికార మహాయుతి కూటమికి 47 సీట్లు దక్కాయి. ఈ విజయంలో నరేంద్ర భోండేకర్ నాయకత్వమే కీలకమని పార్టీలో అందరికీ తెలుసు.
ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో ఎమ్మెల్యే భోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీలిచ్చారు. కానీ మంత్రివర్గం కొలువు దీరాక చూస్తే.. ఆయనకు మొండిచెయ్యి మాత్రమే లభించింది. ఈ పరిణామాలతో ఆయన పలుమార్లు.. పార్టీ అధ్యక్షుడు ఏక్ నాథ్ షిండే, పార్టీ సీనియర్లు ఉదయ్ సామంత్, ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే లకు మెసేజ్‌లు చేశారని.. వారు ఏమాత్రం స్పందించకపోవడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భోండేకర్ షిండే శివసేనకు రాజీనామా చేయడంతో ఆయన వెంట కొందరు ఎమ్మెల్యేలు నడిచే అవకాశం ఉంది. దీంతో షిండే శివసేన బలం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. భోండేకర్‌తో పాటు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్ దాస్ అథావలెకి కూడా మంత్రివర్గంలో చోటు లభించలేదు. అయితే ఆయన ఈ విషయాన్ని అమిత్ షా, నడ్డా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మరిచారని అన్నారు.
మహారాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తే.. ఆదివారం మొత్తం 39 మంత్రులు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేవారు. వీరిలో 19 మంతి భారతీయ జనతా పార్టీకి (బిజేపీ) చెందినవారు కాగా.. 11 మంది షిండే శివసేన పార్టీకి చెందినవారున్నారు. మహాయుతి కూటమిలోని మూడో పార్టీ శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలు 9 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఈ 39 మందితో పాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు శరద్ పవార్, ఏక్ నాథ్ షిండేలతో కలిపి మొత్తం కేబినెట్ లో 42 మంది ఉన్నాయి.
షిండే శివసేన పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఉదయ్ సామంత్, శంభరాజ్ దేశాయి, దాదాజీ దగ్డూ భూసే, సంజయ్ రాథోడ్, గులాబ్ రావు పాటిల్, సంజయ్ షిర్సాత్ ఉన్నారు. శరద్ పవార్ ఎన్సీపికి చెందిన ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌బల్ కూడా మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నారు.