Big Stories

Allu Arjun : యానిమల్ ని పొగడ్తలతో ముంచెత్తిన ఐకానిక్ స్టార్..

Share this post with your friends

Allu Arjun

Allu Arjun : ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్ లో సంచలనంగా మారాడు సందీప్ రెడ్డి వంగా. గతంలో అతను తీసిన అర్జున్ రెడ్డి మైండ్ బ్లాక్ చేస్తే.. ఎప్పుడు వచ్చినా యానిమల్ చిత్రం.. ఎన్నడు కానీ విని ఎరుగని రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మూవీతో సందీప్ స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చేసుకున్నాడు. ఒక్క చిత్రంతో ఇటు టాలీవుడ్ ..అటు బాలీవుడ్ లో ఓ రేంజ్ కి వెళ్ళిపోయాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం వారం దాటిన వసూళ్ల పరంగా ఏమాత్రం తగ్గేదే లేదని దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రంపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు లేటెస్ట్ గా పుష్పా స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ మూవీ పై మనసు పారేసుకున్న ఐకానిక్ స్టార్.. సినిమా గురించి ఒక వివరణాత్మకమైన రివ్యూ సోషల్ మీడియాలో ఇచ్చాడు.యానిమల్ సినిమా చూశాను..అసలు ఏముందా మూవీ ..మతి పోయింది అంతే అంటూ రివ్యూ ఇచ్చేశాడు. సినీ మేధస్సుకు ఈ చిత్రం పరాకాష్ట అంటూ చిత్ర బృందాన్ని తెగ పొగిడేసాడు. ప్రస్తుతం అతను పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంతేకాదు సుదీర్ఘమైన తన పోస్టులో ఎవరెవరు ఎలా నటించారు అంటూ కొందరి పేర్లు మెన్షన్ చేసి మరి వాళ్ళ నటనను మెచ్చుకున్నాడు అల్లు అర్జున్. మరి ఆ వివరాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..

ఇండియన్ యాక్టింగ్ టాలెంట్ ను రణ్‌బీర్‌ నటన ఒక ఎత్తుకు తీసుకువెళ్లింది.. ఈ మూవీలో అతని పర్ఫామెన్స్ ఎందరికో స్ఫూర్తిదాయకం.. అతను నటించిన విధానాన్ని మాటల్లో చెప్పలేము.. హీరోకి అతను నెలకొల్పిన ప్రమాణాలకు నేను ప్రగాఢ గౌరవం ఇస్తాను..అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ’ యానిమల్ సినిమాలో రష్మిక నటన అద్భుతంగా ఉందని పొగిడాడు. ఆమె తన అత్యున్నతమైన నటన ప్రదర్శన ఈ చిత్రంలో ఇచ్చిందని.. తదుపరి చిత్రాలలో కూడా ఇంతకు మించి ప్రతిభను కనబరుస్తుంది అని తాను నమ్ముతున్నట్లు..: అల్లు అర్జున్ అన్నాడు.

మూవీకి మరో స్ట్రాంగ్ పిల్లర్ అయిన బాబీ డియోల్ గురించి మాట్లాడుతూ.. ఇందులో బాబి డియోల్ ఎంతో అద్భుతంగా నటించాడని.. అతని బీభత్సకరమైన నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని అల్లు అర్జున్ అన్నాడు. ఇక అనిల్ కపూర్ తండ్రి పాత్రలో చాలా న్యాచురల్ గా నటించారని అల్లు అర్జున్ చెప్పారు. అతని అనుభవం ఎలాంటిదో ఈ చిత్రంలో అనిల్ కపూర్ తన నటనలో చూపించాడు అని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డాడు.తృప్తి దిమ్రి కూడా తన పాత్ర మేరకు అద్భుతంగా నటించడంతో పాటు అందరి హృదయాలను తన బ్యూటీతో బ్రేక్ చేసింది అని అల్లు అర్జున్ అన్నారు. ఇక వీళ్ళందరి వెనక ఉండి నడిపించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే జస్ట్ మైండ్ బ్లోయింగ్ అన్నాడు అల్లు అర్జున్. అంతేకాదు అతను సినిమా పరిధులన్నిటిని దాటేసాడట.. మరొకసారి సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరూ గర్వపడే విధంగా సందీప్ సినిమా తీశాడని అల్లు అర్జున్ మెచ్చుకున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News