E-Paper
Advertisement

మనుషులా.. గాడిదలా? అధికారులపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఫైర్!

మనుషులా.. గాడిదలా? అధికారులపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఫైర్!
Advertisement

MLC Basavaraj Sarayya: వరంగల్ నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే తన సీటు వద్ద నేమ్ బోర్డు లేకపోవడాన్ని గమనించిన ఆయన, అది తనను వ్యక్తిగతంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను ఈ సమావేశానికి ఎందుకు పిలిచారు? మీరు మనుషులా లేక గాడిదలా?’ అంటూ అధికారులపై నిప్పులు చెరిగారు.

కౌన్సిల్ హాల్‌లో కార్పొరేటర్లందరికీ నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి, ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్సీగా ఉన్న తనకు బోర్డు పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తికి కనీస మర్యాద ఇవ్వడం చేతకాదా అని ప్రశ్నించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ఆయన, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మేయర్ గుండు సుధారాణి ,ఇతర సభ్యులు జోక్యం చేసుకున్నారు. పొరపాటు జరిగిందని, దీనిని సరిదిద్దుతామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, సారయ్య మాత్రం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని తప్పుబడుతూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సీనియర్ నాయకుడికి సభలో ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×