E-Paper
Advertisement

Mulugu Forests: వరంగల్ అడవుల్లో హైఅలర్ట్.. ములుగు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు

Mulugu Forests: వరంగల్ అడవుల్లో హైఅలర్ట్.. ములుగు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు
Advertisement

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అటవీ సరిహద్దుల్లో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. మావోయిస్టు దళాల కదలికలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతూ కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.

అడవుల్లో అలజడి.. గాలింపు ఉధృతం

ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థాయి నిఘా విభాగం (ఎస్ ఐ బీ), గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలగాలతో కలిసి అటవీ లోయలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మావోయిస్టు అగ్ర నాయకత్వం ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్ పోస్టులు

Advertisement

పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం లాంటి కీలక ప్రాంతాల్లో పోలీసు పహారా పెరిగింది. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులు నిర్మించి అటుగా వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరిస్తూ అడవి లోపలికి వెళ్లే మార్గాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

గ్రామాలపై నిఘా.. స్థానికులకు సూచనలు

అటవీ పరిసర గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి కూడా మావోయిస్టులు ప్రవేశించకుండా గస్తీని పెంచార

Advertisement

ALSO READ: Sravanthi Chokarapu: రూ.20 కోట్ల విలువైన విల్లా కట్టిన యాంకర్ స్రవంతి… హీరోయిన్లు కూడా వేస్టేగా?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×