Warangal Man: ప్రేమా అనే పరీక్ష రాసిన ఓ యువకుడు, తాను ఫెయిల్ అయ్యానంటూ దారుణానికి పాల్పడ్డాడు. ఈ యువకుడు ప్రేమ కోసం ఏకంగా తన తల పగలకొట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే…
లవ్.. ఇష్క్.. కాదల్.. ప్రేమ.. ఇలా ఎన్నో పదాలు ఉన్నా భావం మాత్రమే ఒకటే. నేటి రోజుల్లో ప్రేమ అనేది ఓ ఫ్యాషన్ గా కూడా మారింది. అందరు కాదు కానీ, కొందరు మాత్రం ఈ కోవలోకి వస్తారంటున్నారు పెద్దలు. టీనేజ్ వస్తే చాలు.. లవర్ ఉండాల్సిందే అనే రీతిలో ఉంది నేటి కుర్రకారు తీరు. అందుకే ప్రేమ అనే పేరుతో కొందరు యువతీ, యువకులు వారి జీవితాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారని సైకాలజిస్టులు తెలుపుతున్నారు.
అయితే కొందరు యువకులు మాత్రం అమ్మాయి నో చెప్పిందా, ఇక అంతే.. తమ ప్రతాపం చూపిస్తారు. కొందరు యువతి పై దాడి చేయడం కానీ, లేకుంటే తామే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. అలాగే అమ్మాయిలు మోసం చేశారని కూడా క్షణికావేశంలో పలు చర్యలకు పాల్పడుతుంటారు. సేమ్ టు సేమ్ అలాంటి సీన్ వరంగల్ జిల్లాలో జరిగింది.
వరంగల్ లోని కూడలి వద్దకు ఓ యువకుడు సోమవారం మధ్యాహ్నం వచ్చి వేచి ఉన్నాడు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా తన తలను బండకేసి బలంగా కొట్టాడు. దీంతో సుధరు యువకుడి తల నుండి తీవ్ర రక్తస్రావం జరగగా, అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది గమనించి యువకుడి వివరాలను ఆరా తీశారు.
తాను ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ యువకుడు తెలిపిన కారణానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ షాక్ కు గురయ్యారు. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని, ఆ బాధతో తల పగలగొట్టుకున్నట్లు యువకుడు తెలిపాడు. వెంటనే సదరు యువకుడిని వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు.
Also Read: Case Against Aghori: లేడీ అఘోరీపై కేసు నమోదు.. బలిచ్చినట్లు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?
అయితే నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగగా, స్థానికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. అసలు ఆ యువకుడిపై ఎవరైనా దాడి చేశారా అంటూ వాకబు చేసిన స్థానికులు, అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. అమ్మాయి మోసం చేసిందని, తల్లిదండ్రులకు పెట్టే దుఃఖాన్ని మరచి ఇలా తల పగల గొట్టుకోవడం ఏమిటంటూ స్థానికులు చర్చించుకున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి, యువకుడిని ఓదార్చి వైద్యశాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
అమ్మాయి కోసం తల పగలకొట్టుకున్న ఓ యువకుడు
వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్న సంఘటన
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్న యువకుడు
ఎవరు చెప్పినా వినకపోవడంతో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పట్టుకుని కౌన్సిలింగ్
చికిత్స… pic.twitter.com/UIpVO8YZH1
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2024