Homemade Shampoo: ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణం. అబ్బాయిలు , అమ్మాయిలు జుట్టు పెరుగుదలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని ఎదుర్కోవటానికి మార్కెట్లో లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు.
ముఖ్యంగా ప్రతి ఒక్కరూ షాంపూని వాడతారు కానీ అందులో ఉండే హానికరమైన రసాయనాలు జుట్టును బలహీనంగా, పొడిగా మారుస్తాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఇంట్లోనే షాంపూ తయారు చేసుకోవచ్చు. ఇది పెద్దలు , పిల్లల జుట్టుకు కూడా సులభంగా వాడవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా కొత్త జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. షాంపూని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే షాంపూ తయారీ:
కావలసినవి:
ఎర్ర ఉల్లిపాయలు- 8- 10(చిన్నవి)
మెంతులు- ఒక కప్పు
బియ్యం- అర కప్పు
అవిసె గింజలు- అర కప్పు
ఒక కప్పు- కుంకుడు కాయలు ( గింజలు తీసినవి)
-మొదట ఉల్లిపాయను తొక్కతో పాటు ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో రెండు లీటర్ల నీటిని వేసి అందులో ఉల్లిపాయలు, కుంకుడు కాయలు, అవిసె గింజలు, బియ్యం , మెంతి గింజలను నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఇవి రాత్రంతా నానబెట్టిన తర్వాత బాగా ఉబ్బుతాయి.
మరుసటి రోజు ఉదయం ఈ నీటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టండి. తర్వాత గ్రైండర్ జార్‌లో ఉల్లిపాయలు, మెంతులు, బియ్యం, అవిసె గింజలు, కుంకుడు కాయలను వేసి పేస్ట్ చేయండి.
ఈ పేస్ట్ చాలా మెత్తగా ఉండేలా చూసుకోండి. తద్వారా అన్ని పదార్థాలు బాగా కలపండి.
ఇప్పుడు ఈ పేస్ట్‌ను క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేయండి. తద్వారా మృదువైన పేస్ట్ మాత్రమే లభిస్తుంది . ఇతర పనికిరాని వస్తువులన్నీ వేరు చేయబడతాయి.
-ఇప్పుడు ఈ పేస్ట్‌ను రాత్రంతా నానబెట్టి, ఫిల్టర్ చేసి నీటిలో కలపండి. ఇంట్లో కెమికల్ ఫ్రీ షాంపూ రెడీ అవుతుంది.ఇది జుట్టుపై అప్లై చేయడం చాలా సులభం. మీరు ఏదైనా సాధారణ షాంపూ లాగా కూడా దీనిని ఉపయోగింవచ్చు.
Also Read: వీటిని వాడితే.. ఎంతటి తెల్ల జుట్టు అయినా క్షణాల్లోని నల్లగా మారడం ఖాయం
-అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కుంకుడు కాయ వల్ల ఈ షాంపూలో నురుగు కూడా ఏర్పడుతుంది.
-మీరు ఇంట్లో తయారుచేసిన షాంపూని పిల్లల జుట్టుకు కూడా అప్లై చేయవచ్చు. ఈ షాంపూ మీ జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా, మందంగా చేస్తుంది. ఇది జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
-దీన్ని గ్లాస్ జార్ లేదా బాటిల్‌లో నింపి 20 రోజుల పాటు రిఫ్రిజిరేటర్‌లో హాయిగా నిల్వ చేసి, వారానికి రెండు మూడు సార్లు వాడుకోవచ్చు.
దీనిని తరుచుగా వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది . ఒత్తైన జుట్టు కోసం ఈ షాంపూ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.