Warangal News: దారుణం. ఘోరం. అమానుషం. పాపం. ఐదుగురు సభ్యుల ముఠా. అందులో ఓ మహిళా. అంతా కలిసి కార్పొరేట్ స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేశారు. సోషల్ పేజెస్‌లో కొందరు స్టూడెంట్స్‌ను ట్రాప్ చేశారు. వారితో ఫ్రెండ్ షిప్ చేసి.. మందు తాగించి.. గంజాయి మత్తు ఎక్కించి.. దారుణంగా రే*ప్ చేశారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి.. ఆ పసి మొగ్గలతో వ్యభిచారం చేయించారు. వరంగల్‌లో కలకలం రేపిన మైనర్ బాలికలతో వ్యభిచారం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సంచలన నిజాలు బయటపడ్డాయి.
ప్రధాన సూత్రధారి లతతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. కేసు వివరాలను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరించారు. నగరంలో వ్యభిచార ముఠా నిర్వహిస్తోంది కీలక నిందితురాలు ముస్కు లత. యువతులకంటే.. మైనర్లతో వ్యభిచారం చేయిస్తే మస్త్ డబ్బులు వస్తాయని డేంజరస్ స్కెచ్ వేసింది. అందుకోసం ఆమె ఓ సెక్స్ రాకెట్ ముఠా ఏర్పాటు చేసింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తో వరంగల్ నగరంలో ఉన్న టాప్ స్కూల్స్‌కు చెందిన మైనర్ బాలికలను ట్రాప్ చేసింది. తన లవర్‌తో కలిసి.. ఓ మైనర్ బాలికకు మద్యం తాగించి.. గంజాయికి అలవాటు చేసింది. మాయమాటలు చెప్పి వరంగల్ నుంచి నర్సంపేటకు తీసుకెళ్లి తన లవర్ తో రేప్ చేయించింది ఆ కిలాడీ లేడీ.
ఈ నెల 11న తమ అమ్మాయి కనిపించడం లేదని ఆ చిన్నారి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. కట్ చేస్తే.. ఈ ఖతర్నాక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. దామెర మండలం, లాదెల్ల గ్రామంలో సెక్స్ రాకెట్ నడుపుతున్న ప్రధాన నిందితురాలు మస్కు లతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను పోలీసులు తమదైన స్టైల్‌లో ఎంక్వైరీ చేసి.. ముఠా సభ్యుల వివరాలు తెలుసుకొని.. అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
నిందితులైన లత, అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. మస్కు లత నుంచి 1.8 కిలోల గంజాయి, 4300 కండోమ్ ప్యాకెట్స్, 75 వేల క్యాష్, బ్రెజా కార్, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
మైనర్ బాలికల పట్ల వారి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. వారిని ఎల్లప్పుడూ కనిపెట్టుకు ఉండాలని వరంగల్ సీపీ సూచించారు. ఏమాత్రం వారి ప్రవర్తనలో తేడా వచ్చినా, అనుమానం వచ్చినా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నగరంలో వ్యభిచార ముఠాలు ఉన్నట్టు తెలిస్తే.. తాట తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీపీ.