JathiRatnalu Sequel.. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను కామెడీతో విపరీతంగా ఆకట్టుకున్న మూవీ జాతి రత్నాలు (JathiRatnalu). 2021 మార్చి 11న విడుదలైన తెలుగు కామెడీ చిత్రం ఇది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ (Nag Ashwin) నిర్మించిన ఈ సినిమాకి కేవీ.అనుదీప్ (KV.Anudeep) దర్శకత్వం వహించారు. నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), ప్రియదర్శి (Priyadarshi), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), నరేష్ (Naresh), మురళి శర్మ (Murali Sharma) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కామెడీతో ముఖ్య నటుల నటనతో ప్రశంసలు అందుకుంది. అలాంటి సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జాతిరత్నాలు సీక్వెల్ పై అనుమానాలు..
ముఖ్యంగా కోవిడ్ సమయంలో విడుదల అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా బాగా పెర్ఫార్మ్ చేసింది. టాలీవుడ్ లో వచ్చిన ఐకానిక్ కామెడీ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ ప్రకటించారు కూడా.. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా సీక్వెల్ అమెరికా నేపథ్యంలో ఉంటుందని.. వీసా లేకుండా అక్కడికి వెళ్లిన ఈ ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే దానిపైనే కథ ఉంటుందని కూడా సమాచారం. అటు ఈ నేపథ్యంలోనే సినిమా వస్తే.. ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం యుఎస్ లో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి.. అలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు కుర్రాళ్ళు చేసే రచ్చ ఎలా ఉంటుందనే దానిపై సినిమా చేస్తే.. ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారని, సినిమా సూపర్ హిట్ అవుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.
ALSO READ:Karthikeya 3: కార్తికేయ – 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలో అంటూ..!
వారిద్దరి వల్లే ఆలస్యం..
కాస్త ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ వస్తుందని అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టు ఇప్పుడే మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే అటు నవీన్ పోలిశెట్టితో పాటు ఇటు డైరెక్టర్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకే వీరిద్దరి కారణంగానే జాతి రత్నాలు సీక్వెల్ ఇప్పుడు సెట్ పైకి వెళ్లడం కష్టమే అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా గనుక ఈ సమయంలో రిలీజ్ అయితే ,కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ కి భారీ గుర్తింపు లభిస్తోంది. దీనికి తోడు ‘డీజే టిల్లు’ సీక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా కూడా సూపర్ హిట్ గానే నిలిచింది. అటు మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇటు ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలోనే ‘జాతి రత్నాలు’ సీక్వెల్ కూడా ఇప్పుడు తీసుకురాగలిగితే నవీన్ ఖాతాలో మరో సూపర్ హిట్ గ్యారెంటీ అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ మేరకు ఈ సినిమా గురించి ఆలోచిస్తారో చూడాలి.