Water in Gas Cylinder: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మొయినాబాద్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆనోటా ఈనోటా చర్చకు దారితీసింది. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినియోగదారుల డిమాండ్ చేస్తున్నారు.
మాములుగా వంట గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. కానీ మొయినాబాద్ మండలంలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. వంట గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులు నీళ్లు రావడం వినియోగదారుడిని షాక్‌కు గురించేసింది.
కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె శేఖర్ అనే వినియోగదారుడు ఎప్పటిలాగే ఇటీవల గ్యాస్ బుక్ చేశాడు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్ వచ్చింది. వచ్చిన సిలిండర్‌ను గ్యాస్ పొయ్యికి అనుసంధానించాడు. ఎంత చూసినా గ్యాస్ పొయ్యి వెలగకపోవటంతో అసలు గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ ఉందా? లేదా?అనే అనుమానంతో గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించాడు. ఇంకేముంది ఆ సిలిండర్‌లో గ్యాస్ కాకుండా నీళ్లు ఉండటాన్ని గమనించి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.
మొయినాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదుట ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వ్యవహారం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మరో గ్యాస్ సిలిండర్‌ను వినియోగదారుడు తీసుకుని ఆగ్రహంతో వెనుతిరిగాడు.
బాధిత వ్యక్తి బిగ్ టీవీతో మాట్లాడుతూ.. ఇలాంటివి మళ్లీ పునరావతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సమస్య ఎక్కడ జరుగుతుందో దాన్ని సమూలంగా రుపుమపల్సిందిగా వినియోదారులు కోరుతున్నారు. నాలాగా ఇంకెవరికి జరగకూడదని ఆయన తెలిపారు.