BigTV English

Hage Geingob : నమీబియా అధ్యక్షుడు కన్నుమూత..

Hage Geingob : నమీబియా అధ్యక్షుడు కన్నుమూత..

Hage Geingob : నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (Hage Geingob) (82) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దేశ రాజధాని అయిన విండ్ హెక్ లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఇటీవలే హేజ్ గింగోబ్ కు క్యాన్సర్ నిర్థారణ అవ్వగా.. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అంతలోనే ఆయన చనిపోయారన్న వార్త.. ఆ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.


2015 లో హేజ్ గింగోబ్ నమీబియా అధ్యక్షుడిగా ఎన్నికై.. దీర్ఘకాలంపాటు దేశాన్ని పాలించారు. ఆయన మృతితో అంగోలో ముంబా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. త్వరలోనే కేబినెట్ భేటీ నిర్వహించి.. తదుపరి కార్యాచరణపై ప్రకటన చేస్తామని అంగోలో ముంబా తెలిపారు. హేజ్ గింగోబ్ మృతి దేశానికి తీరని లోటని తెలిపారు. నవంబరులో అక్కడ అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×