BigTV English

Cricket for a Cause: కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు, రోహిత్ బ్యాట్ రూ.24 లక్షలు

Cricket for a Cause: కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు, రోహిత్ బ్యాట్ రూ.24 లక్షలు

Cricket for a Cause fund Rising Auction: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ సేవాభావం ఇప్పుడు నెట్టింట పెద్ద వైరల్ అయ్యింది. ఎందుకంటే భార్య అతియా శెట్టితో కలిసి వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ‘క్రికెట్ ఫర్ ఎ కాజ్’ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు.


ఇందులో ప్రముఖ క్రికెటర్ల దుస్తులు, బ్యాట్ లు వేలం పాట వేశారు. అయితే ఇక్కడ అందరికన్నా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వస్తువులే అధిక ధరలు పలికాయి. అందులో ముఖ్యంగా తన జెర్సీని వేలం వేస్తే.. రూ. 40 లక్షలు, గ్లోవ్స్ రూ. 28 లక్షలు పలికాయి. రోహిత్ బ్యాట్ రూ. 24 లక్షలు, ధోనీ బ్యాట్ రూ. 13 లక్షలు, ద్రవిడ్ బ్యాట్ రూ. 11 లక్షలు, రాహుల్ జెర్సీ రూ. 11 లక్షలు పలికాయి.

ఈ కార్యక్రమం ద్వారా రాహుల్-అతియా దంపతులు మొత్తం రూ.1.93 కోట్లు సేకరించారు. ఈ మొత్తాన్ని విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు. ఈ ఫౌండేషన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక స్కూల్‌ను నడుపుతోంది. వారికోసం ఈ నిధిని అందించనున్నారు.


Also Read: నువ్వొస్తానంటే.. మేం వద్దంటామా?: రోహిత్ కోసం ఫ్రాంచైజీల క్యూ!

ఈ సందర్భంగా అతియా శెట్టి మాట్లాడుతూ.. ఈ ఫౌండేషన్‌తో తనకు చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉందని తెలిపింది. ఇక్కడి పిల్లలకు పాఠాలు బోధించడం, వారితో సమయం గడపడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చేదని గుర్తు చేసుకుంది. తన నానమ్మ ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌కు మద్దతుగా ఉండాలనేది తన అభిమతమని తెలిపింది.

రాహుల్-అతియా దంపతులు ఒక సదుద్దేశంతో చేపట్టిన ఈ పనికి ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు మద్దతు తెలిపారు.

వీరే కాకుండా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్వింటన్ డి కాక్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా మద్దతుగా నిలిచారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×