Big Stories

Telangana State Temparatature: బిగ్ అలర్ట్.. రేపటి నుంచి దంచికొట్టనున్న ఎండలు.. 5 రోజుల పాటు జాగ్రత్త

Telangana State Temparatature
Telangana State Temparatature

Telangana State Temparatature (weather news today Telangana): ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం మొదలుకాక ముందు నుండే అంటే ఫిబ్రవరి నెల నుండే ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. మార్చిలో వచ్చే శివరాత్రికి శివ శివ అంటూ చలి పోతుందని పెద్దలు అంటున్నా.. భూమిపై పెరుగుతున్న కాలుష్యం మూలంగా గ్లోబల్ వార్మింగ్ హీటెక్కుతుంది. దీంతో ఎండాకాలం ప్రారంభంకాకముందే ఎండలు మొదలయ్యాయి.

- Advertisement -

ఉదయం, సాయంత్రం వేళ ఉండే వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఉదయం 10 దాటకముందే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలు రాకముందే సూర్య దేవుడు ప్రజలపై మంటలు కురిపిస్తున్నాడు. దీంతో మార్చి నెలనే ఇలా ఉంటే ఇక ఎండాకాలం మొత్తం ఏ విధంగా ఉంటుందో అని వాతావరణ శాఖ, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మార్చి నెల మొదలైందో లేదో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోయాయి. తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ పైనే ఉంటుంది. ఇప్పటికే ఎండల కారణంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ ప్రకటిస్తుంది. తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని స్పష్టం చేసింది.

నేటి నుంచి వచ్చే 5 రోజుల పాటు ఎండలు(ఉష్ణోగ్రత) గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటే తప్పా ఇంట్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ 5 రోజుల పాటు 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రాత్రి వేళల్లోను సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది.

ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకూడదు. ఉదయం 12 లోపు తిరిగి 4 తర్వాత ఏ పనులు ఉన్నా చూసుకోవాలి. అంతేకాదు ఎండలో తిరిగే వారు తప్పక నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News