BigTV English

Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన యువతులు.. అసభ్యంగా హోలీ ఆడిన వీడియో వైరల్

Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన యువతులు.. అసభ్యంగా హోలీ ఆడిన వీడియో వైరల్
Delhi Metro Viral Video
Delhi Metro Viral Video

Delhi Metro Viral Video (today’s latest news): దేశ రాజధాని ఢిల్లీకి ఓ చరిత్ర ఉంది. దేశంలో జరిగే ఏ ముఖ్య ఘట్టమైనా రాజధానిలోనే జరుగుతుంది. దేశంలో రాజధానికి ఎంతమంచి ఆదరణ, ప్రాముఖ్యత ఉన్నా.. ఢిల్లీ మెట్రో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఢిల్లీ అంటే ఎవరికైనా ముందుగా మెట్రోనే గుర్తుకు వచ్చే పరిస్థితి నెలకొంది. అమ్మాయిలు, అబ్బాయిలు ముద్దు పెట్టుకోవడాలు, హగ్ చేసుకోవడం, డ్యాన్స్, రీల్స్, ష్యాషన్ షో, పొట్టి బట్టలు వేసుకుని తిరగడం, కొట్లాటలు, అబ్బాయిల అసభ్య ప్రవర్తన ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటన్నిటితో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.


తరచూ ఏదో ఒక అసభ్య ఘటనతో వార్తల్లోకి ఎక్కే ఢిల్లీ మెట్రో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. మార్చి 25వ తేదీ, సోమవారం రోజున హోలీ పండుగ రానుంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి. అయితే హోలీ ముందుగా చేసుకోవడం అంతా బాగానే ఉంది. కానీ కొందరు మహిళలు మెట్రోలో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం అందరూ చూస్తుండగా ఒకరిపై ఒకరు పడుకుంటూ మరి వీడియోలు చేశారు. బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్ కు యువతులు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. కానీ వారిని ఏమి అనలేక పోయారు.

మెట్రోలో కింద కూర్చుని ఇద్దరు యువతులు వీడియోలు చేశారు. ఇద్దరు యువతులు తెలుపు దుస్తులు ధరించారు. అందులో ఒక యువతి తెల్ల చీర కట్టుకోగా మరో యువతి వైట్ డ్రెస్ వేసుకుంది. ఇద్దరు కలిసి మెట్రోలోని డోర్ ఓపెన్ అయ్యే చోట మధ్యలో ఓ ఖాళీ స్థలం చూసుకుని కూర్చున్నారు. వారి ముందు ఒక తెల్లటి బట్టలో బ్లూ కలర్ హోలీ కలర్ ను కూడా వారి వెంట తెచ్చుకున్నారు. దానిని వారిద్దరు కూర్చున్న స్థలం ముందు పెట్టుకున్నారు. ఇక వీడియో మొదలుకాగానే ఒకరికి ఒకరు ముందుగానే కలర్స్ పూసుకుని ఇక వాటిని ఒకరి చెంపలతో మరొకరు తాకుతూ.. ఇష్టం వచ్చిన చోట చేతులు వేశారు. అనంతరం వీడియో మధ్యలో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఇలా ఇద్దరు యువతులు ప్రవర్తిస్తున్న తీరును అక్కడ పక్కనే కూర్చున్న ఢిల్లీ వాసులు చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది వీరి ప్రవర్తనను చూసి నవ్వుకోగా.. మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇద్దరు యువతులు కలిసి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘దీన్నే పైత్యం అంటారు’ అంటూ మండిపడుతున్నారు. పవిత్ర హోలీ పండుగను అవమానపరుస్తూ, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్ కు ఒకరిని ఒకరు తాకుతూ వీడియో చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఇద్దరు యువతులపై వెంటనే ఢిల్లీ మెట్రో యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా కోరుతున్నారు.

 

Tags

Related News

Japanese Pet Trend: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

Big Stories

×