E-Paper
Advertisement

TG politics : రాష్ట్ర రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?

TG politics : రాష్ట్ర రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి హడావుడి లేదు. అటు అధికార పార్టీ 99 రోజులు కార్యక్రమంలో నిమగ్నం అవ్వగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్డడం లేదు. ప్రజల్లోకి వెళ్లడంలేదు. బీజేపీ సైతం అదే ధోరణిని కొనసాగిస్తున్నది.అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడే వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.సీఎం రేవంత్ మాత్రం పలుశాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ వెళ్తున్నారు. జిల్లా పాలనాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలని,విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, స్కూళ్లను పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

సమ్మర్ ఎఫెక్ట్..

వేసవి ప్రారంభం కావడంతో రాజకీయనాయకులు బయటకు రావడం లేదని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఈనెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. వేసవిలో నీటి కొరతను తీర్చేందుకు అధికారులకు సర్కారు కీలక ఆదేశాలు జారీచేసింది.మరోవైపు 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.బడ్జెట్ సెషన్స్ కోసం సీఎం, డిప్యూటీ సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో మహిళలకు, రైతులకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వేగంగా ఆర్థిక పద్దు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం బడ్జెట్‌లో ఎలా మాట్లాడాలో, ప్రశ్నలు ఎలా అడగాలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

మూసీపై రచ్చ..

Advertisement

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మూసీ పునరుజ్జీవంపై రచ్చ జరుగుతోంది.రేవంత్ సర్కార్ మూసీని సందరీకరించాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగా పలు చోట్ల భూమి సేకరించే క్రమంలో కూల్చివేతలను హైడ్రా చేపడుతున్నది. దీనిపై అటు బాధితుల పక్షాన బీఆర్ఎస్ నేతలు ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని, విధ్వంసం చేయడమే రేవంత్ పని అని తీవ్ర విమర్శలు చేస్తున్నది. మరోవైపు కూల్చివేతలు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని, కొత్త నిర్మాణాలు, సుందరీకరణ ఎలా సాధ్యమని సర్కారు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నది.ఇటీవల ఖమ్మం జిల్లాలో భూదాన భూములపైనా ఇలాగే పెద్ద గొడవ జరగగా సర్కారు బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు, భూమి పట్టాలు అందజేసిన విషయం తెలిసిందే.

Jana Sena Party: జనసేన ఆవిర్భావ సభ రద్దు చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?

ఎన్నికల్లేవు..

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. రేపటి నుంచి పదో తరగతి, త్వరలో ఇంటర్ పరీక్షలు సైతం ప్రారంభంకానున్నాయి. వేసవిలో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా సర్కారు వాటిని వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 99 రోజుల పాటు ‘ప్రజాపాలన-పట్టణ ప్రగతి’ కార్యక్రమాలు జిల్లా, నగరం, గ్రామాల్లో వేగంగా కొనసాగుతున్నాయి. మరల జూన్ లేదా జూలైలో ఎన్నికలు ఉంటాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే పొలిటికల్ పార్టీలు సైతం ప్రస్తుతం రిలాక్స్ మోడ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.మూడ్రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హడావుడి నెలకొననుంది.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×