BigTV English

Bike Taxi: ఇక హైదరాబాద్‌లోనూ బైక్ ట్యాక్సీ బ్యాన్? అదే జరిగితే..

Bike Taxi: ఇక హైదరాబాద్‌లోనూ బైక్ ట్యాక్సీ బ్యాన్? అదే జరిగితే..

కర్నాటకలో ఈనెల 16నుంచి బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ నిషేధం ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అమలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా బైక్ ట్యాక్సీలపై బ్యాన్ విధించాలంటూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకోవాలని యూనియన్ నేతలు కోరారు. త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే హైదరాబాద్ లో కూడా బైక్ ట్యాక్సీలు కనుమరుగు అవుతాయి.


రవాణా వాహనాలు వేరే..
హైదరాబాద్ రోడ్లపై 60,000 నుండి 70,000 బైక్ టాక్సీలు నడుస్తున్నట్టు అంచనా. వీటివల్ల ప్రయాణికులకు సౌకర్యం ఉంటున్నా.. అదే స్థాయిలో వ్యవస్థకు నష్టం జరుగుతోందనే వాదన కూడా వినపడుతోంది. బైక్ లను కేవలం వ్యక్తిగత వాహనాలుగా మాత్రమే వినియోగించుకోవాలి. అవి రవాణా వాహనాలు కాదు. అంటే వాటికి కేవలం వైట్ నెంబర్ ప్లేట్ మాత్రమే ఉంటుంది. పసుపుపచ్చ నెంబర్ ప్లేట్ ఉన్నవి రవాణా వాహనాలుగా గుర్తిస్తారు. బైక్ లను వ్యక్తిగత అవసరాలకోసం తీసుకుని, రవాణా వాహనాలుగా నడపడం చట్ట విరుద్ధం అంటున్నారు గిగ్ వర్కర్స్ యూనియన్ నేతలు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని చెబుతున్నారు. ఆటోలు, ట్యాక్సీలకు కూడా గిరాకీలు తగ్గిపోతున్నాయని, తమ పొట్టకొట్టడం న్యాయం కాదనేది వారి వాదన.

కర్నాటకలో ఇలా..
కర్నాటకలో బైక్ ట్యాక్సీల సంఖ్య పెరిగిపోవడంతో ఆటోలు, కార్ ట్యాక్సీల ఓనర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారంతా ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా వారికి సానుకూలంగా నిర్ణయం తీసుకుని, బైక్ ట్యాక్సీలను నిషేధించింది. ఆ తర్వాత వారు కర్నాటక హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో కర్నాటకలో ఈనెల 16నుంచి బైక్ ట్యాక్సీలు బ్యాన్ అయ్యాయి. తెలంగాణలో కూడా అదే సమస్య ఉంది. ఇక్కడ నిషేధం ఇంకా అమలులోకి రాలేదు. నిషేధం విధించాలని ఆటో, కార్ ట్యాక్సీ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.


ఇబ్బందులు..
బైక్ ట్యాక్సీల వల్ల లేనిపోని ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు అది విఘాతం కలిగిస్తోందని కొందరు అంటున్నారు. సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, బీమా భద్రత లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి కంపెనీలు బైక్ ట్యాక్సీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నడుపుతున్నాయి. అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు ఇద్దరి వద్ద ఆ కంపెనీలు డబ్బులు దండుకుంటున్నాయి. బైక్ ట్యాక్సీలను క్రమబద్ధీకరించే వరకు వాటిని నిషేధించాలనే డిమాండ్ మొదలైంది.

రద్దు చేస్తే నష్టమేనా..?
బైక్ ట్యాక్సీల వల్ల ముఖ్యంగా సామాన్యులకు లాభం చేకూరుతోంది. ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పెట్టినట్టవుతుంది. అటు బైక్ లు నడిపే యువతకు ఉపాధి అవకాశంగా కూడా ఇది ఉపయోగపడుతోంది. బెంగళూరులో బైక్ ట్యాక్సీలను బ్యాన్ చేసిన తర్వాత ట్రాఫిక్ సమస్య అనూహ్యంగా పెరిగింది. అప్పటి వరకు బైక్ లపై ప్రయాణించిన వారు ఆటోలు, కార్ ట్యాక్సీలపై ఆధారపడాల్సి రావడంతో వాటి సంఖ్య కూడా పెరిగింది. అటు దాదాపు లక్షమంది బైక్ ట్యాక్సీలు నడిపేవారు ఇబ్బందులు పడుతున్నారు. వారంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

హైదరాబాద్ లో కూడా బైక్ ట్యాక్సీలు రద్దు చేస్తే ఇబ్బందుల తప్పవని అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. కర్నాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బైక్ ట్యాక్సీలను రద్దు చేసింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి.. అదే తరహా విధాన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

Tags

Related News

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Big Stories

×