Bigg Boss Season 9 Promo : బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేసే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగులో ఇప్పటికీ ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 9వ సీజన్ గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss Season 9) కి సంబంధించి ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా నాగార్జున మాట్లాడుతూ “ఆటలో అలుపు వచ్చినంత సులభంగా గెలుపు రాదు.. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగమే” అంటూ నాగార్జున చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈసారి మాత్రం ఈ షో మరింత రసవత్తరంగా, పోటాపోటీగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది.
గెలవాలంటే యుద్ధం చేయాలి..
ఇక ఈ ప్రోమో వీడియోలో నాగార్జున మరింత యంగ్ లుక్ లో కనపడుతూ.. ఈ సీజన్ గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈసారి గెలుపు రావాలి అంటే మరింత కష్టపడాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పారు.. నాగార్జున మాటలను బట్టి చూస్తుంటే ఈసారి సీజన్ ఎంతో రసవత్తరంగా, కఠినమైన టాస్కులు కూడా ఉండబోతున్నాయని స్పష్టం అవుతుంది. టాస్కులలో గెలవాలంటే యుద్ధం కూడా చేయాలని నాగార్జున తెలియజేశారు. ప్రోమో చూస్తుంటే మాత్రం ఈసారి బిగ్ బాస్ భారీ స్థాయిలోనే ఉండబోతుందని తెలుస్తోంది.
కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ…
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఇప్పటికే ఎంతోమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే బుల్లితెర నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారని సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ నాగార్జున కాకుండా ఇతర హీరోలు వస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.
హోస్ట్ నాగార్జున..
నాగార్జున కాకుండా ఆయన స్థానంలో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్నారని, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి రాబోతున్నారంటూ ఎంతో మంది హీరోల పేర్లు వినిపించాయి కానీ తాజాగా విడుదల చేసిన ప్రోమోతో ఈ కార్యక్రమానికి మరోసారి కూడా నాగార్జున హోస్టాగా వ్యవహరిస్తున్నారని క్లారిటీ వచ్చింది. నాగార్జున మూడవ సీజన్ నుంచి వరుసగా ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తదుపరి అన్ని సీజన్లకు నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. సీజన్ 8 కార్యక్రమంలో భాగంగా నిఖిల్ విన్నర్ కాగా, గౌతమ్ కృష్ణ రన్నర్ గా నిలిచారు. మరి ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఎవరు పాటిస్పేట్ చేయబోతున్నారు, టాస్కులు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.