E-Paper
Advertisement

Hyderabad : పచ్చని కాపురంలో పచ్చడి పెట్టిన చిచ్చు.. భార్య ఆత్మహత్య

Hyderabad :  పచ్చని కాపురంలో పచ్చడి పెట్టిన చిచ్చు.. భార్య ఆత్మహత్య
Advertisement

Hyderabad : హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో చట్నీ విషయంలో దంపతుల మధ్య తలెత్తిన గొడవ భార్య ఆత్మహత్యకు పాల్పడేల చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోపతండాకు చెందిన రమణ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25) అనే యువతిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ వద్ద డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తుంది. ఈ దంపతులు ఇద్దరు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివసముంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు.

Advertisement

సోమవారం ఉదయం అతడు విధులకు వెళ్లగా భార్య చాలా వీడియోకాల్స్‌ చేసింది. రమణ స్పందించకపోవడంతో ఫోన్‌ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా కేకలు వేసింది. చనిపోతున్నానని చెప్పి చందన ఫోన్‌ పెట్టేసింది. అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్‌ చేసి విషయం చెప్పి త్వరగా తన ఇంటికి వెళ్లి చూడాలనికోరాడు. యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉంది. రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేసుకుంటామని తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×