BigTV English

Vijayawada : యూటీఎఫ్‌ “ఛలో విజయవాడ” ఉద్రిక్తం.. పలువురు అరెస్ట్ ..

Vijayawada: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ ఛలో విజయవాడకు పిలుపునిచ్చింది. విజయవాడంలో ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను యూటీఎఫ్ కోరారు. అందుకు నిరసన వల్ల శాంతి భద్రతలకు విషయంలో సమస్యలు ఏర్పడతాయని పోలీసులు తెలిపారు.

Vijayawada : యూటీఎఫ్‌ “ఛలో విజయవాడ” ఉద్రిక్తం.. పలువురు అరెస్ట్ ..

Vijayawada: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ “ఛలో విజయవాడ”కు పిలుపునిచ్చింది. విజయవాడలో ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను యూటీఎఫ్ సభ్యులు కోరారు. కానీ.. నిరసనల వల్ల శాంతి భద్రతల విషయంలో సమస్యలు ఏర్పడుతాయని పోలీసులు తెలిపారు. నిరసన సభకు అనుమతి పోలీసులు నిరాకరించారు.


విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్దకు యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సకాలంలో జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతి భద్రలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి అధ్యక్ష, కార్యదర్శులను నిర్బంధించారు.

మరోవైపు రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె నేటితో 30 వ రోజుకి చేరుకుంది. ఎస్మా ప్రయోగాన్ని లెక్క చెయకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. తమ డిమాండ్ లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. అయితే తమ డిమాండ్ లు నెరవేర్చకుండా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించటం దారుణమని వాపోయారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హమీ నెరవేర్చాలని తేల్చిచెప్పారు. తమ న్యాయమైన సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తుది పోరాటానికి సిద్ధం అవుతున్నామని అంగన్వాడీలు ప్రకటించారు. ప్రజలు నుంచి మద్దతు తీసుకుంటామని.. మంగళవారం నుంచి ఇంటింటికీ వెళ్లి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.


Tags

Related News

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Big Stories

×