Gerrit Graham : సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎంతోమంది తమ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ.. లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. వెండితెరపై నవ్వులు పూయిస్తూ.. మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. ప్రేక్షకులను అలరించిన సెలబ్రిటీలు ఉన్నట్టుండి కనుమరుగైపోతే .. కానరాని లోకాలకు చేరువైతే ఆడియన్స్ తట్టుకుంటారా? అలా ఎంతోమంది అనారోగ్య సమస్యలతో, వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడుస్తూ అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నటుడి మృతి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయన ఎవరో కాదు ఫాంటమ్ ఆఫ్ ది ప్యారడైజ్ మూవీ నటుడు గెరిట్ గ్రాహం (Gerrit Graham) .. రచయితగా కూడా పేరుపొందిన ఈ హాలీవుడ్ నటుడు ఊపిరితిత్తుల వ్యాధితో న్యూయార్క్ లోని రైన్ బెక్ లో ఉన్న ఒక అసిస్టెంట్ లివింగ్ ఫెసిలిటీ లో మంగళవారమే కన్నుమూసినట్లు ఆయన భార్య డెబోరా కూపర్ మీడియాకి సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయన వయసు 77 సంవత్సరాలు.
1968లో గ్రీటింగ్స్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత స్టార్ ట్రెక్, సీన్ ఫెల్ట్ తోపాటు తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలలోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించిన గెరిట్ థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు అన్న వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు, పలువురు సినీ ప్రముఖులు , హాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికన్ రంగస్థల నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన.. టెలివిజన్, చలనచిత్ర రంగంలో మంచి పేరు సొంతం చేసుకున్నారు. స్క్రిప్ట్ రచయితగా, పాటల రచయితగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. యూజ్డ్ కార్స్, నేషనల్ లాంపూన్స్ క్లాస్ రీ యూనియన్, చైల్డ్స్ ప్లే 2, గ్రీటింగ్స్ వంటి ఎన్నో చిత్రాలలో కనిపించిన ఈయన ఫాంటమ్ ఆఫ్ ది ప్యారడైజ్ లో పనిచేశాక మరింత గుర్తింపు లభించింది.
also read: తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!
1982లో డెబోరా కూపర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి జాక్ , హెన్రీ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెప్టెంబర్ 15 2026న ఊపిరితిత్తుల వ్యాధి సంబంధిత సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలస్యంగా ఆయన భార్య బయటపెట్టారు..