E-Paper
Advertisement

YS Sharmila : బైబై కేసీఆర్.. ఇదే రిటర్న్ గిఫ్ట్..

YS Sharmila : బైబై కేసీఆర్.. ఇదే రిటర్న్ గిఫ్ట్..
Advertisement

YS Sharmila : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశ్యంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై మొదటి నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నానని చెప్పుకొచ్చారు . కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని షర్మిల సైటర్ వేశారు. బైబై కేసీఆర్ అనే స్లోగన్ తో ఉన్న పోస్టర్ ప్రదర్శించారు.

తెలంగాణ సీఎం నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు. పోడు భూముల పేరుతో గిరిజనులను మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే పోరాటం చేశానని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ నుంచి తప్పుకున్న సమయంలో తన పార్టీ వాళ్లే అర్థంచేసుకోలేకపోయినా.. ఎన్ని మాటలు అన్నా పడ్డానని వివరించారు. కానీ కేసీఆర్ ను ఓడించాలనే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చానన్నారు. అందుకే త్యాగం చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేశానని షర్మిల అన్నారు.

Advertisement

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మకయ్యాయని షర్మిల విమర్శించారు. వాచ్ డాగ్ లా ఉండాల్సిన బీజేపీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై బీజేపీ యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు తోడు దొంగలేనని అన్నారు. కేసీఆర్ స్కీములన్నీ స్కామలని మోదీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటిఎంలా కేసీఆర్ వాడుకున్నారని బీజేపీ నేతలు విమర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదని బీజేపీ నేతలను షర్మిల ప్రశ్నించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించవద్దన్నారు. ప్రజాతీర్పును గౌరవించాలని స్పష్టం చేశారు. 2014,2018 ఎన్నికల్లో కలిపి మొత్తం 45 మంది ప్రజాప్రతినిధులను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అందులో 40 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఉన్నారని వివరించారు. ఇప్పుడు మాత్రం బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయకూడదని స్పష్టంచేశారు. ప్రభుత్వం మారాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. తెలంగాణ ప్రజల్లో జీవితాల్లో మార్పురావాలని ఆక్షాంక్షించారు.

Advertisement

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×