E-Paper
Advertisement

Anant Ambani, Radhika Merchant: ఒక్కటైన అనంత్, రాధిక.. పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Anant Ambani, Radhika Merchant: ఒక్కటైన అనంత్, రాధిక.. పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
Advertisement

Anant Ambani, Radhika Merchant married: అపర కుభేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబనీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. వీరిద్దరూ శుభముహూర్తంలో వధూవరులు ఒక్కటయ్యారు. శనివారం శుభ్ ఆశీర్వాద్, ఆదివారం రిసెప్షన్ తో వివాహ వేడుకలు ముగియనున్నాయి. రాత్రి జరిగిన శుభ్ వివాహ్‌కు సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఈ పెళ్లి కోసం ఏకంగా రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్, రాధిక మర్చంట్ వివాహం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ వివాహ వేడుక కోసం ముకేశ్ అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఫ్రీ వెడ్డింగ్ నుంచి రిసెప్షన్ వరకు దాదాపు రూ. 4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లు వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా. కాగా, ఈ మొత్తం ఖర్చు ముకేశ్ అంబానీ నికర ఆదాయంలో కేవలం అర శాతమని ఓ మీడియాలో వెల్లడైంది.

Advertisement

మెరిసిన తారలు..
వివాహానికి వచ్చిన ప్రముఖులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సినీ తారలు షారుక్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ చేసిన డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. తర్వాత రజనీకాంత్ కూడా స్టెప్పులు వేశారు. వీరంతా మాధురీదీక్షిత్ చోళీకే పీచే సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. కాగా, శనివారం జరిగే శుభ్ ఆశీర్వాద్‌కు ప్రముఖులంతా ఫార్మల్ దుస్తుల్లో రానున్నారు.

Tags

Related News

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Big Stories

Advertisement
×