BigTV English

Elon Musk Donation To Trump : ట్రంప్‌ పార్టీకి ఇలాన్ మస్క్ మద్దతు.. ఎన్నికల ప్రచారం కోసం భారీ విరాళం!

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెరికన్ బిలియనీర్ ఇలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, ఆయన కోసం ప్రచారం నిర్వహించే సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి మస్క్.. భారీ విరాళం అందించారు. ప్రస్తుతానికి మస్క్ ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారో బహిర్గతం కాలేదు. కానీ ఆ వివరాలు అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ జూలై 15న ఈ వివరాలు వెల్లడించనుంది.

Elon Musk Donation To Trump : ట్రంప్‌ పార్టీకి ఇలాన్ మస్క్ మద్దతు.. ఎన్నికల ప్రచారం కోసం భారీ విరాళం!

Elon Musk Donation To Trump| ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెరికన్ బిలియనీర్ ఇలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, ఆయన కోసం ప్రచారం నిర్వహించే సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి.. మస్క్ భారీ విరాళం అందించారు. ప్రస్తుతానికి మస్క్ ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారో బహిర్గతం కాలేదు. కానీ ఆ వివరాలు అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ జూలై 15న ఈ వివరాలు వెల్లడించనుంది.


ఇటీవల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా మారింది. ఈ తరుణంలో ఇలాన్ మస్క్ ఎన్నికల విరాళం రావడం.. ట్రంప్ అభిమానులకు గుడ్ న్యూస్. మస్క్ విరాళంతో ట్రంప్ ప్రచారానికి మరింత బలోపేతమైందని అమెరికా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాన్ మస్క్ ఇప్పటికీ బహిరంగంగా తన మద్దతు ట్రంప్ కే అని ప్రకటించలేదు. ట్విట్టర్ లో తరుచూ ట్వీట్లు ఇలాన్ మస్క్ చేస్తుంటారు. ఈ విషయంలో నెటిజెన్లు ఆయనను.. ”మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు?” అని ఎన్నోసార్లు ప్రశ్నించినా మస్క్ సమాధానం చెప్పలేదు.

Also Read: Plateau School Collapse: కుప్పకూలిన స్కూల్.. 22 మంది పిల్లలు మృతి.. శిథిలాల్లో 100 మంది!


ఇక్కడ మరో విచిత్రమేమిటంటే.. గతంలో ట్రంప్, ఇలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధాలు నడిచాయి. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు.. మస్క్.. ఆయన తీసుకున్న నిర్ణయాలను విమర్శించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మస్క్ కు ప్రధాన ఆదాయం టెస్లా ఎలెక్ట్రిక్ కార్ల బిజినెస్ నుంచే వస్తుంది.

ఈసారి ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో.. మాట్లాడుతూ తాను అధ్యక్షునిగా ఎన్నికైతే.. ఎలెక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా నుంచి దిగుమతులపై అధిక పన్నులు విధిస్తానని ప్రకటించారు. ఇది టెస్లాకు ఉపయోగకరమైన వార్త. మస్క్ ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్ పార్టీకి భారీ విరాళం వెనుక ఇదే కారణమని అందరూ భావిస్తున్నారు. పైగా ఇటీవల ఒక బిజినెస్ సమావేశంలో మస్క్ మాట్లాడుతూ.. “ఎప్పుడూ నాతో మాట్లాడని ట్రంప్ నాకు సడెన్ గా ఫోన్ చేశారు,” అని చెప్పాడు.

Also Read: మరోసారి బయటపడిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన!

గత నెలలో ట్రంప్, బైడెన్ మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ లో బైడెన్ సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడం.. మాట్లాడడానికి తడబడడం చూసి.. ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బైడెన్ కు వయసు రీత్యా ఆరోగ్య, మతిమరుపు సమస్యలు ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు, సొంత పార్టీ నాయకులు సైతం బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఎన్నికల ప్రచారానికి విరాళాలు కూడా రావడం కష్టంగా మారింది.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×