E-Paper
Advertisement

NTR: ఎన్టీఆర్ హోస్ట్‌గా రియాలిటీ షో!.. 100 కోట్లతో నయా ప్రోగ్రామ్!

NTR: ఎన్టీఆర్ హోస్ట్‌గా రియాలిటీ షో!.. 100 కోట్లతో నయా ప్రోగ్రామ్!
ntr

NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌. ఈ పేరు వినగానే ఏదో తెలియని వైబ్రేషన్స్‌ వస్తాయి. వెండితెరైనా.. బుల్లితెరైనా ఆయన నటనకు ఫిదా అవ్వాల్సిందే. త్రిబుల్‌ ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్‌.. త్వరలో టెలివిజన్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఆదరణ పొందిన ఓ ప్రముఖ ఛానెల్‌ రియాలిటీ షోలో జూనియర్ ఎన్టీఆర్ కన్పించనున్నట్టు సమాచారం. ఆ షో ను మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ టేకప్ చేయబోతోందట. సుమారు వంద కోట్ల ఖర్చుతో ప్రోగ్రాంను డిజైన్‌ చేస్తున్నట్లు టాక్.

వెండితెరపై వైవిధ్యం చూపుతూనే.. బుల్లితెరపైనా సత్తా చాటుతున్నారు ఎన్టీఆర్‌. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్‌ షోలకు హోస్ట్‌గా చేసి.. ఇంటింటికి మరింత చేరువయ్యారు. చాలా సందర్భాల్లో యాంకర్‌గా కాకుండా మనతో.. మనలో మాట్లాడే వ్యక్తిగా ఆయన కనిపించారు. హోస్ట్‌గా చేస్తే.. నటించటం కాదని.. జనంతో మమేకమవ్వాలంటూ సందేశమిచ్చేలా.. అద్భుతమైన ప్రదర్శనలో ఆకట్టుకున్నారు తారక్‌.

ఎన్టీఆర్‌ అంటేనే ఓ సంచలనం. ఆయన కాస్త గ్యాప్‌ తీసుకుని చేస్తున్న ప్రోగ్రాం అంటే అభిమానుల్లో ఉత్కంఠ ఉండటం సహజం. అందుకు తగినట్లే దానిని రూపొందించేలా మల్లెమాల ప్రొడక్షన్స్‌ సన్నాహాలు చేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. పాపులర్ అయిన ‘అలా మొదలైంది’ షో ను డైరెక్ట్ చేసిన చంద్రశేఖర్.. ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న రియాల్టీ షో నడిపించే బాధ్యత తీసుకున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జరిగినట్లు.. షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయ్యాక చేస్తారా.. లేదా షెడ్యూల్ గ్యాప్‌లో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దగ్గుబాటి రానా హోస్ట్ చేసిన నెం.1 యారి త‌ర‌హాలో ఈ టాక్ షో ఉండ‌బోతుంద‌ని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది.

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

×