Big Stories

AI in pharmacy industry: ఫార్మసీ రంగంలో ఏఐ.. మరింత మెరుగ్గా మందుల తయారీ..

AI in pharmacy industry : టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిన మెడికల్ రంగం మరింత మెరుగ్గా పేషెంట్లకు చికిత్సను అందించడం సాధ్యమవుతోంది. కేవలం చికిత్స విషయంలోనే కాదు.. మందుల విషయంలో కూడా పేషెంట్లకు మెరుగ్గా సాయం అందుతోంది. ఫార్మసీ రంగం అనేది ఒక్కసారిగా ఎంతో అభివృద్ధి చెందడమే దీనికి కారణం. తాజాగా టెక్నాలజీలో సంచలనం సృష్టించిన ఏఐ అనేది ఫార్మసీ రంగాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

- Advertisement -

ఒక భయంకరమైన వ్యాధికి మందును తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఆ డ్రగ్‌కు ప్లానింగ్ దగ్గర నుండి తయారీ వరకు ఎన్నో ఏళ్లు సమయం తీసుకుంటుంది. ఏఐ అనేది ఈ డ్రగ్ డెవలప్‌మెంట్ ప్రక్రియకు పట్టే సమయాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈరోజుల్లో చాలావరకు డ్రగ్ తయారీ అనేది మానవ మేధస్సుతోనే సాధ్యమవుతుంది. కానీ మొదటిసారి దీనికోసం కృత్రిమ మేధస్సు సాయం తీసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

- Advertisement -

మనుషులు అయితే ఒక డ్రగ్ తయారీలో ఎలాంటి మాలిక్యూల్స్‌ను ఉపయోగించాలి, వాటిని ఎంత మోతాదులో ఉపయోగించాలి అనేది సరిగ్గా కనిపెట్టగలరు. కానీ ఏఐ అలాంటిది చేయగలదా లేదా అన్న అనుమానంతో ఇప్పటివరకు దీనిని ఫార్మసీ ఇండస్ట్రీలో ఉపయోగించలేదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ డ్రగ్ డెవలప్‌మెంట్ ప్రక్రియను రెట్రోసింథసిస్ అని అంటారు. ఒక డ్రగ్‌ను తయారు చేయడం కోసం వారు ఎన్నో కెమికల్ రియాక్షన్స్‌ను ప్రయత్నించాల్సి ఉంటుంది. అదే ప్రక్రియను ఏఐకు కూడా ట్రైనింగ్ ఇచ్చి.. దానిని కూడా ఫార్మసీ రంగంలో కలుపుకోవాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

జీ2రెట్రో అనే ప్రక్రియతో ఏఐకు ఫార్మసీ రంగంలో ట్రైనింగ్ ఇవ్వాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఏఐ ప్రయోగాలు చేసి చూసింది ఒక శాస్త్రవేత్తలు టీమ్. ఏఐ సాయంతో నాలుగు కొత్త డ్రగ్స్‌ను కూడా తయారు చేశామని బయటపెట్టింది. ఇవి మనుషులపై మరింత మెరుగ్గా పనిచేస్తాయని వారు గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏఐ సాయంతో మనుషుల ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News