Big Stories

Water Plume : మరో గ్రహంపై నీటి జాడ.. 4 రెట్లు పెద్ద సైజ్‌లో..

Water Plume : భూమి కాకుండా ఇతర గ్రహంపై మానవాళి జీవనం కొనసాగాలంటే ముందుగా కావాల్సింది సరిపడా ఆక్సిజన్, నీరు. అందుకే ఇప్పటికీ చంద్రుడిపై నీటిజాడలు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటు ఇతర గ్రహాలపై కూడా దృష్టిపెట్టారు. తాజాగా శాటర్న్‌పై నీటిజాడ లాంటిది ఒకటి కనిపించిందని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారానే ఇది సాధ్యమయ్యిందన్నారు. దీని గురించి మరింత సమాచారం బయటపెట్టారు.

- Advertisement -

నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక చోట నుండి మరో చోటుకు ప్రయాణించే ఆవిరిని కనిపెట్టింది. ఈ ఆవిరి అనేది దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వారు బయటపెట్టారు. అంటే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మూడుసార్లు ప్రయాణించినంత దూరం. ఆస్ట్రానాట్స్‌కు ఇలాంటిది ఒకటి కనిపించడం ఇదే మొదటిసారి అని వారు తెలిపారు. దీని ద్వారా మొత్తం శాటర్న్ సిస్టమ్‌కే ఎంత నీరు అవసరం పడుతుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -

శాటర్న్‌లోని ఒక మూన్ అయిన ఎంకెలాడస్ దాదాపు 500 కిలోమీటర్ల డయామీటర్‌తో ఉంటుంది. అంటే ఈ మూన్ ఒకటి.. భూమికంటే 4 రెట్లు పెద్దగా ఉంటుందని అర్థం. కొన్నాళ్ల క్రితం శాటర్న్‌లో పాస్ఫరస్ అనేది ఉంటుందని, అది మనుషుల జీవితానికి సపోర్ట్ చేస్తుందని ఇప్పటికే నిర్ధారించారు. ఈ శాటర్న్ మూన్‌లో బయట క్రస్ట్ అనేది ఐస్ రూపంలో ఉంటుంది. కానీ దాని లోపల మాత్రం రాళ్ల లాగా గట్టిగా ఉంటుందని గుర్తించారు. ఈ రెండిటి మధ్యలో మొత్తం గ్రహాన్ని కవర్ చేసే ఉప్పునీరు ఉంటుందని పరిశోధనల్లో పాక్షికంగా తేలింది.

ఎంకెలాడస్‌లో ఉండే అగ్నిపర్వతాల నుండి ఐస్‌తో పాటు ఆవిరి లాంటిది కూడా బయటపడుతుందని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. అప్పుడప్పుడు ఇవి ఈ మూన్ నేలపై కూడా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా శాటర్న్‌పై కనిపించిన ఆవిరి చుక్క.. మూన్‌కంటే 20 రెట్లు పెద్దగా ఉంటుందని చూసి తాము కూడా షాక్ అయ్యామని ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు. నాసా కనిపెట్టిన ఈ విషయాన్ని ఆర్టికల్ రూపంలో అందరికీ అందుబాటులో ఉంచారు. ప్రయోగాల తర్వాత ఈ ఆవిరి చుక్క గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపెడతామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News