E-Paper
Advertisement

Siddipet Crime : సిద్ధిపేటలో దారుణం.. విషప్రయోగంతో యువకుడి హత్య..

Siddipet Crime : సిద్ధిపేటలో దారుణం.. విషప్రయోగంతో యువకుడి హత్య..
Advertisement
Siddipet Crime news

Siddipet Crime news(Local News Telangana):

సిద్దిపేట జిల్లా తీగుల్‌లో దారుణం జరిగింది. విషప్రయోగంతో యువకుడిని హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఇంట్లో భార్యతో ఉపేందర్ కలిసి ఉండగా ఆమె భర్త నాగరాజు చూశాడు. ఒకసారి మాట్లాడాలని ఇంటికి పిలిపించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉపేందర్ కు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వగా.. అతడికి అనుమానం కలిగింది. ఎప్పుడూలేనిది నాగరాజు ఇంటికి పిలిచి మరీ మర్యాదలు చేస్తుండటంతో.. కూల్ డ్రింక్ వద్దని తిరస్కరించాడు.

అయినా వదలని నాగరాజు.. పురుగుల మందు కలిపి ఉపేందర్ తో బలవంతంగా తాగిచ్చాడు. దీంతో తీవ్ర స్వస్థతకు గురైన ఉపేందర్ ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత పోలీసుల స్టేట్‌మెంట్‌లో విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించారని వెల్లడించాడు. గాంధీలో చికిత్స పొందుతూనే ఉపేందర్ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కవివాహేతర సంబంధం ముగ్గురి జీవితాలను నాశనం చేసింది. పరాయి మగాడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉపేందర్ హత్యకు గురయ్యాడు. ఉపేందర్ ను హత్యచేసిన నాగరాజు జైలుకెళ్తాడు. అటు ప్రియుడు లేక, ఇటు భర్త లేక.. ఆ వివాహిత ఇప్పుడు ఏకాకిగా మిగిలింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×