
Munugode : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం కొరటికల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను స్థానికులు నిలదీశారు. గతంలో ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీంతో.. ఆయన ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూసుకుంట్ల వ్యాఖ్యలకు స్థానికులు అవాక్కయ్యారు.
మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చలమల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికార బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే నేడు సీపీఐ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుంది.. సీపీఎం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఓటర్లు పార్టీలకు సపోర్ట్ చెయ్యాలా లేదా అభ్యర్థులు పార్టీలు మారినట్టు తమ అభిప్రాయాలు మార్చుకోవాలా అనేది అర్ధంకాని పరిస్థితి.
మునుగోడులోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఓట్లు వేసి గెలిపించే ఓటర్లే కుక్కలు అయితే కుక్కలకున్న విశ్వాసం ఏంటో చూపిస్తాం అని మునుగోడు ప్రజలు అంటున్నారు.ఎన్నికలు ఉన్నప్పుడే ఓటర్లు గుర్తొస్తారని.. సాధారణ సమయంలో పట్టించుకోరని.. ఓటర్ల సత్తా ఏంటో చూపిస్తాం అని స్థానిక ప్రజలు గుస్సా అవుతున్నారు.
.
.