Private collages Strike: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో నిన్నటితో డెడ్‌లైన్ ముగిసిన నేపథ్యంలో..నేటిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే…సోమవారం నుంచి నిరవధిక బంద్ చేపడతామని అల్టిమేటం జారీ చేశౄయి.
2024-25 విద్యా సంవత్సరానికి గానూ పెండింగ్‌లో 9 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో దసరాకు 1200 కోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే మిగిలిన 900 కోట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మిగతా బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంద్‌కు పిలుపునిచ్చాయి. సమస్య పరిష్కరం పరిష్కారం కాకపోతే ఛలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించాయి. ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (FPEI) నాయకులు రమేష్ బాబు మాట్లాడుతూ, “కాలేజీలు నడపడానికి పెట్టుబడులు, జీతాలు చెల్లించలేకపోతున్నాం. విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బంది పెడుతున్నారు” అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు విజిలెన్స్ ఇన్‌క్వైరీ ఆర్డర్ చేసింది. ప్రైవేట్ కాలేజీలలో అక్రమాలు, మోసాలు జరిగాయా అని చూడాలని నిర్ణయించింది. అయితే, యాజమాన్యాలు దీన్ని “అనవసరమైన భయపెట్టడం”గా చూస్తున్నాయి. సెప్టెంబర్ 2025లో 600 కోట్లు విడుదల చేసినప్పుడు బంద్‌ను వాయిదా వేశాయి, కానీ మళ్లీ హామీలు ఉల్లంఘించడంతో ఇప్పుడు తీవ్రంగా మారింది.
అయితే ఈ బంద్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల చదువు ఆగిపోతుంది. ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ కోర్సులు ఆగిపోవడంతో పరీక్షలు, సెమిస్టర్‌లు ఆలస్యమవుతాయి. విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు కూడా బంద్‌కు మద్దతు తెలపుతున్నారు. “ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి వస్తుంది, ఇది అన్యాయం” అని వారు చెబుతున్నారు. కాలేజీలు మూసివేస్తే ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు ప్రభావితమవుతాయని తెలిపారు.
Also Read: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. 21 మందికి కొత్త పోస్టింగ్‌లు..
ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణ విద్యా వ్యవస్థకు తీవ్ర దెబ్బ తగులుతుంది. ప్రభుత్వం తక్షణం 900 కోట్లు విడుదల చేసి, మిగిలిన బకాయిలకు రోడ్‌మ్యాప్ ఇవ్వాలన్నారు. లేకపోతే, బంద్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇక ఈ అంశం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..