 
					Helicopter Crash: నేపాల్‌లోని ఎవరెస్ట్ ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు మళ్లీ ప్రమాదాలకు దారితీసింది. అక్టోబర్ 29బుధవారం తెల్లవారుజామున, లోబుచే హెలిప్యాడ్ వద్ద ఆల్టిట్యూడ్ ఎయిర్‌కు చెందిన H125 హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ఈ ఘటన ట్రెక్కర్లను రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తుండగా జరిగిందని సమాచారం. హెలికాప్టర్ డ్రైవర్ కెప్టెన్ బిబెక్ ఖడ్కా మాత్రమే ఉండి, అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఎటువంటి మరణాలు లేవు, కానీ హెలికాప్టర్‌కు తీవ్ర నష్టం సంభవించింది. ఈ ప్రమాదం స్థానిక కెమెరాల్లో రికార్డ్ అయ్యి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
అయితే ఈ ఘటన బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన సైక్లాన్ మొంథా ప్రభావంతో జరిగింది. అక్టోబర్ మొదటి వారంలోనే ఈ సైక్లాన్ కారణంగా ఎవరెస్ట్ ప్రాంతంలో అసాధారణంగా భారీ మంచు, వర్షాలు కురిశాయి. ఫలితంగా, నేపాల్, తిబెట్ (చైనా) వైపులా ఎవరెస్ట్ ట్రెక్కింగ్, టూరిజం అన్నీ అక్టోబర్ 28 నుంచి మూసివేశాయి. రోడ్లు మంచుతో మూసుకుపోయి, విజిబిలిటీ తగ్గిపోయింది. లోబుచేలో మాత్రమే 210 మంది ట్రెక్కర్లు మంచులో చిక్కుకున్నారు. మొత్తంగా 2,000కి పైగా మంది ట్రెక్కర్లు ఎవరెస్ట్ ప్రాంతంలో బందీలుగా మారారు.
ఈ సమయంలో, ఆల్టిట్యూడ్ ఎయిర్ హెలికాప్టర్ లుక్లా (Lukla) ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 7:41కి ఎగిరిపోయింది. ప్యాసింజర్లు లేకుండా, లోబుచేలో చిక్కుకున్న విదేశీయ టూరిస్టులను రెస్క్యూ చేయడానికి మాత్రమే వెళ్లింది. 7:52కి లోబుచే హెలిప్యాడ్‌కు చేరుకుని ల్యాండింగ్ ప్రయత్నిస్తుండగా, మంచుతో కప్పబడిన ప్యాడ్ మీద జారిపడి, హెలికాప్టర్ పక్కకు మొగ్గు చూపి కూలిపోయింది. వాతావరణం క్లియర్‌గా ఉన్నప్పటికీ, డీప్ స్నో డ్రిఫ్ట్స్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Also Read: భారత్ ఆర్మీలోకి భైరవ్ బెటాలియన్.. పాక్, చైనాకు చుక్కలే!
ప్రమాదం తర్వాత, నేపాల్ పోలీసు, సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAAN) తక్షణం రెస్క్యూ టీమ్‌లను పంపాయి. డిస్ట్రిక్ట్ పోలీస్ సూపరింటెండెంట్ (DSP) కుంవార్ ప్రకారం, లోబుచేలో చిక్కుకున్న 210 మంది ట్రెక్కర్లలో చాలామంది విదేశీయులు. మొత్తం ఎవరెస్ట్ ప్రాంతంలో 2,000 మందికి పైగా ట్రెక్కర్లు బందీలుగా ఉన్నారు. తిబెట్ వైపు టికెట్ సేల్స్ మూసివేయబడి, రోడ్లు మూసుకుపోయాయి. నేపాల్ ప్రభుత్వం ట్రెక్కర్లకు వార్నింగ్‌లు ఇచ్చినప్పటికీ, ఈ సైక్లాన్ అప్రత్యక్షంగా వచ్చింది.
ఎవరెస్ట్ శిఖరం దగ్గర కూలిపోయిన హెలికాఫ్టర్…
ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం..
నేపాల్‌లో మంచు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో, అక్టోబర్ 29 బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్‌పై జారిపడి..
ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మౌంట్ ఎవరెస్ట్… pic.twitter.com/vKmQMBmjpW
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2025