Students Protest: జాతీయ రహదారిపై గురకుల విద్యార్ధులు మెరుపు ధర్నాకు దిగారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై బైటాయించారు. గురుకులంలో అక్రమాలు ఆపండి.. ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ శైలజ తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విద్యార్థులు..
ప్రిన్సిపల్ శైలజ తమను వేదిస్తుందని, ప్రభుత్వం నుండి తమకు వచ్చే ఫండ్స్ కేటాయించడం లేదని, ప్రశ్నించిన విద్యార్థులను వేదిస్తుందని విద్యార్థులు ఆరోపణలు చేశారు. ఇంటర్నల్ పరీక్షలను రాయనివ్వలేదని, పరీక్ష ఫీజులు 3000 చొప్పున తమతోనే కట్టించారాని, కులం పేరుతో దూషిస్తుందని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థినిలు.. కలెక్టర్ వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు స్టూడెంట్స్.
ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్, విద్యార్థినుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. విద్యార్థినిపై చేయి చేసుకున్నమహిళా కానిస్టేబుల్‌ను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు స్టూడెంట్స్. అక్కడి పరిస్థితి క్షణాల్లో ఉత్కంఠంగా మారింది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్ధినిలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: ఫర్నిచర్‌ను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు.. మణుగూరు BRS ఆఫీస్ వద్ద హై టెన్షన్..
ఈ నేపథ్యంలో షాద్‌నగర్–హైదరాబాద్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు భారీ బలగాలను రంగంలోకి దించారు. పోలీసులు విద్యార్థినులను రహదారి నుండి వెళ్లమని కోరినా, వారు వెనక్కు తగ్గలేదు.
ప్రిన్సిపల్ శైలజ పై గతంలో అనేక ఆరోపణలు..
శైలజ ఎక్కడ పని చేసిన విద్యార్థులను వేధించడం అలవాటుగా మారిందంటూ.. విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. సంవత్సరం క్రితం సూర్యాపేట గురుకుల స్కూల్లో పనిచేస్తున్నప్పుడు.. పాఠశాలలోనే మద్యం తాగుతూ సీసాలతో అడ్డంగా బుక్ అయింది ప్రన్సిపల్ శైలజ. అప్పుడు కూడా మద్యం తాగి వేధింపులకు గురిచేస్తుందంటూ.. సూర్యాపేటలో విద్యార్థులు రోడ్డెక్కారు.
ప్రిన్సిపల్ శైలజను గత ఏడాది సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.. అయినా తీరు మార్చుకోలేదు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ గురుకుల కాలేజీ ప్రిన్సిపల్ పనిచేస్తున్నారు.
మళ్లీ వివాదాస్పదంగా మారిన తాజాగా ప్రిన్సిపల్ శైలజ తీరు మళ్లీ వివాదస్పదంగా మారింది. ఆమెను సస్పెండ్ చేసేంతవరకు ధర్నా విరమించమని ఆందోళన చేస్తున్న విద్యార్థినీలు.